దీక్షాసేథ్ 10 ఏళ్ల కిందట టాలీవుడ్‌ను తన అందచందాలతో ఒక ఊపు ఉపేసిన నార్త్ హీరోయిన్. ఢిల్లీలో పుట్టిన దీక్షాసేథ్ తన తండ్రి ఉద్యోగ పరంగా ముంబై, చెన్నై, కోల్‌కతా, రాజస్థాన్, గుజరాత్ సహ అనేక ప్రాంతలలో నివసించేది. అమెకు చిన్నపటి నుంచే నటనపై అసక్తి ఉండేది. ఈ క్రమంలోనే తన కాలేజీ రోజులలో మొదటి సంవత్సరం జరిగిన ఫేమినా అందాల పోటీలలో పాల్గొని యూత్ తిరుగులేని క్రేజ్ సంపదించుకుంది. ఆ సయమంలో మోడలింగ్‌లో తన కెరియర్ను మొదలు పెట్టింది.
మోడలింగ్‌లో ఓ వెలుగు వెలుగుతున్ప సమయంలోనే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం మూవీలో ఒక కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగుతో పాటు తమిళ్లో కూడా కొన్ని పాత్రలు చేసింది. తెలుగులో మాస్‌మహరాజ్ రవితేజ పక్కన మిరపకాయ్, గోపీచంద్ వాంటెడ్ సినిమాలు చేసిన తర్వాత తమిళ్లోను సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో నిప్పు, ఊకొడతారా ఉలిక్కిపడతారా, ప్రభాస్ రెబల్ సినిమాలు చేసింది.
ఆ తర్వాత ఉన్నట్టుండి తెలుగు సినిమాలకు దూరమైపోయింది. తర్వాత బాలీవుడ్‌లోకీ ఎంట్రి ఇచ్చి 2,3 సినిమాలు చేసింది. తర్వాత కన్నడలో ఒక సినిమా చేసింది. దీక్షాసేథ్ భారీగా అందాలను ఆరపోయడంతో అమ్మడి అందచందలకు ఫిదా అయన దర్శక నిర్మాతలు గ్లామర్ పాత్రలకు ఆమెనే హీరోయిన్గా పెట్టుకునేవారు. స్టార్ హీరోల పక్కన చేసిన ఒక హిట్ కూడా దీక్షకు పడలేదు. ఉన్నంతలో రవితేజ మిరపకాయ్ మాత్రమే చెప్పుకొదగ్గ హిట్. సినిమాల్లో అవకాశాలు తక్కువ అవుతున్న సమయంలోనే ఓ స్టార్ హీరో కొడుకుతో డేటింగ్లో మునిగి తేలింది.
అతడితో కలిసి మొత్తంగా హద్దులు కూడా దాటేసింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచింది. ఆ స్టార్ హీరో కొడుకు – దీక్ష పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఆ తర్వాత సడెన్‌గా ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. దీక్ష అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ద్వారా తన హాట్ హాట్ అందాలతో కాక రేపుతుంది. అయితే దీక్షతో డేట్ చేసిన ఆ స్టార్ హీరో కొడుకు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు.