సినీ ఇండస్ట్రీలో నెపొటిజం అన్నది కొంత కాలంగా పాతుకుపోయింది ఈ విషయం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తాత పేర్లు చెప్పుకుని కొందరు..నాన్న ల పేరు చెప్పుకుని కొందరు..ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇంకా వస్తూనే ఉంటారు కూడా ..అది స్టాప్ చేయటం ఎవ్వరి వల్ల కాదు. అయితే, రీసెంట్ విజయ్ దేవరకొండ..తన సినిమా లైగర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో..చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. విజయ్ ఏ ఉద్దేశం తో అన్నాడు తెలియదు కానివ్వండి..ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో కొందరు హీరోలనే టార్గెట్ చేసిన్నట్లు ఆ కామెంట్లు ఉన్నాయి.
నా అయ్య, నా తాత మీకు తెలియదు,..కానీ, నా పై ఇంత ప్రేమ చూపిస్తున్నారు..ఈ సినిమా మీకే అంకితం..ఆగస్టు 25 బాక్స్ లు బద్ధలైపోవాలే..అంటూ ఓ రేంజ్ కుమ్మేశాడు స్పీచ్. పాపం, ఇప్పుడు ఆ కామెంట్లు రీవర్స్ అయ్యాయి . దీంతో కొందరు స్టార్ హీరో ఫ్యాన్స్ విజయ్ పై సీరియస్ అయ్యారు. నిన్న కాక మొన్న వచ్చిన వాడి నువ్వు మా అభిమాన హీరోలను అనేంత రేంజ్ కి ఎదిగావా అంటూ కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు. అయితే, తాజా గా విజయ్ మాటల పై కమెడియన్ కమ్ ప్రోడ్యూసర్ బండ్ల గణేస్గ్ రియాక్ట్ అయ్యారు.
ఆయన సోషల్ మీడియా వేదికగా..ట్వీట్స్ తో రెచ్చిపోయి..ఫైర్ అయ్యారు. ఆయన ట్వీట్ చేస్తూ..”‘తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా, మహేశ్‌బాబులా, రామ్‌చరణ్‌లా, ప్రభాస్‌లా.. గుర్తుపెట్టుకో బ్రదర్’ అని ట్వీట్ చేశాడు. దీనికి అర్ధం..వారసత్వం ఒక్కటే కాదు..టాలెంట్ కూడా ఉంటేనే అందరు హీరో సక్సెస్ అవుతారు..కేవలం నాన్న పేర్లు చెప్పుకుని రాలేదు..అని మీనింగ్. అయితే, ఇవి పరోక్షంగా సమంత కు కూడా వర్తిస్తాయి. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో లో అమ్మడు..విజయ్ ని ఓ రేంజ్ లో పొగిడేసింది. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అంటూ ఓ బిరుదు కూడా ఇచ్చేసింది.అంతేకాదు సమంత కూడా నెపొటిజం పై ఇలానే స్పందించింది. దీంతో బండ్ల కౌంటర్ సమంత కి వర్తిస్తుంది అంటున్నారు జనాలు.
తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ 🔥🔥🔥🔥 @AlwaysRamCharan @tarak9999 @urstrulyMahesh 🐅🐅🐅🐅
— BANDLA GANESH. (@ganeshbandla) July 22, 2022