సినీ ఇండస్ట్రీలో కి వచ్చిన అందరు హీరో లుగా సెటిల్ అవ్వాలంటే కుదరదు.. కొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా…సెటిల్ అవుతారు. కొందరు చిన్న హీరోలుగా స్ధిరపడతారు. అందరు పాన్ ఇండియా హీరోలు అంటే కుదరదు గా. అయితే, సినీ ఇండస్ట్రీలో ఓ బడా హీరో కొడుకు..ప్రజెంట్ కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన హీరో రాజ్ తరుణ్ తో సినిమా అంటే..నవ్వేసుకున్నాడట. వాడు ఓ పిల్ల బచ్చ అంటూ దారుణంగా అవమానించాడట.
పూర్తి వివరాలోకెళ్లితే…సినీ ఇండస్ట్రీలోకి హీరో రాజ్ తరుణ్..షార్ట్ ఫిల్మ్ బేస్ మీద వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చిన తక్కువ టైంలో నే మంచి మంచి సినిమాలో నటించాడు. అంతేనా..స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా కలెక్షన్స్ సాధించిపెట్టాడు. కానీ, కొన్ని తప్పుడు కధలను చూస్ చేసుకోవడం వల్ల..ఆయన ఇండస్ట్రీలో హీరో గా ఎక్కువ కాలం ఎదగలేకపోయాడు. హీరోలుగా అవకాశాలు దక్కించుకోలేకపోయినా..అభిమానుల్లో రాజ్ తరుణ్ ఎప్పుడు..హీరో గానే ఉంటాడు.
అయితే, ఓసారి డైరెక్టర్ రాజ్ తరుణ్..కి మల్టీ స్టారర్ కధ చెప్పారట. స్టోరీ లైన్ చాలా బాగుంది..ఇలాంటి స్క్రిప్ట్ లో ఆ స్టార్ హీరో కొడుకు అయితే, కరెక్ట్ గా సూట్ అవుతాడు అని డిసైడ్ అయ్యి..డైరెక్టర్ ఆ బడా హీరో కొడుకుని మీట్ అవ్వడానికి అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్లితే..ఆ హీరో మాటలకు షాక్ అయ్యాడట. మర్యాదలు బాగానే చేసిన ఆయన..స్క్రిప్ట్ కూడా బాగా నచ్చిందని చెప్పాడట.
కానీ, “ఈ కధ కి రాజ్ తరుణ్ ఓ పిల్ల బచ్చగాడు..అతని వదిలేయ్..నీకు ఓ స్టార్ హీరో ని ఈ సినిమాకు కాల్ షీట్స్ ఇప్పిస్తాను..”అంటూ డైరెక్టర్ తో చెప్పుకొచ్చాడట. కక్కుర్తి గల ఆ డైరెక్టర్..రాజ్ తరుణ్ ని మోసం చేసి..వేరే హీరోలతో(మల్టీ స్టారర్) తెరకెక్కించాడు . అనూహ్యంగా ఈ సినిమా దొబ్బేసింది. దీంతో డైరెక్టర్ దూల తీరిపోయింది..అప్పట్లో ఈ విషయం తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది.