Moviesత్రివిక్రమ్ - పార్వతి మెల్టన్‌ రిలేషన్ గురించి తెలుసా... ఈ వార్త‌ల...

త్రివిక్రమ్ – పార్వతి మెల్టన్‌ రిలేషన్ గురించి తెలుసా… ఈ వార్త‌ల వెన‌క స్టోరీ ఇదే..!

ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్ లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ త్రివిక్రమ్ ఫుల్ బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ మాటల రచయితగా కెరీర్ ప్రారంభించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తరుణ్ హీరోగా నువ్వే నువ్వే సినిమాకు దర్శకత్వం వహించి తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. అతడు, జల్సా, అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ సినిమాలకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ల‌ లిస్టులో ఉన్న త్రివిక్రమ్ పై గత కొద్దిరోజులుగా ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్ – పూజ హెగ్డే మధ్య ఏదో ఉంది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ దర్శనమిస్తున్నాయి. అస‌లు వాస్త‌వ‌, అవాస్త‌వాలు ఎలా ? ఉన్నా త‌న సినిమాల్లో హీరోయిన్ల‌ను త్రివిక్ర‌మ్ ఎక్కువుగా రిపీట్ చేస్తూ వ‌స్తున్నాడు. ఇలియానాకు రెండు సార్లు, స‌మంత‌కు మూడు సార్లు ఛాన్సులు ఇచ్చాడు. ఇప్పుడు పూజా హెగ్డేను వ‌రుస‌గా మూడోసారి రిపీట్ చేస్తున్నాడు. మ‌రో యంగ్ హీరోయిన్‌, మ‌ళ‌యాళ భామ సంయుక్త మీన‌న్‌ను భీమ్లానాయ‌క్ సినిమాలో రిక‌మెండ్ చేయ‌డంతో పాటు ఇప్పుడు ఆమెకు త‌న రిక‌మెండేష‌న్‌తోనే మ‌రో రెండు ఛాన్సులు ఇప్పించాడ‌ని టాక్ ?

ఇక గతంలోనూ త్రివిక్రమ్‌కు మ‌రో హీరోయిన్‌తో లింక్ ఉన్న‌ట్టు గాసిప్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వెన్నెల సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పార్వతి మెల్టన్ తో త్రివిక్రమ్‌కు చాలా స‌న్నిహిత బంధం ఉందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. పార్వతి మెల్టన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సమయంలో త్రివిక్రమ్ పార్వతి మెల్టన్ కు డైమండ్ నెక్లెస్ కూడా గిఫ్ట్ గా ఇచ్చారని టాక్ ఉంది. అంతే కాకుండా జల్సా సినిమా తర్వాత త్రివిక్రమ్ పార్వతి మెల్టన్ బంధం బలపడిందన్న మాట వినిపించింది.

ఆ తర్వాత కొద్ది రోజులు వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడంతో ఎవరి దారి వాళ్లు చూసుకున్నట్టు అప్పట్లో టాక్. అయితే ఈ వార్తల్లో ఇంతవరకు నిజం ఉంది అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఇది కేవలం అప్పట్లో వచ్చిన టాక్ మాత్రమే. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటే పార్వతి మెల్టన్ సినిమాలకు దూరం అయ్యి అమెరికాలో ఉంటోన్న‌ సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news