హీరో సిద్దార్థ్ సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలో ఫాలోకి వచ్చిన హీరో. తనదైన స్టైల్ లో నటించి ..అభిమానులను అలరించి..మెప్పించిన ఈయన..ఇప్పుడు చేతిలో సినిమాలు లేక ఖాళీ గా ఉంటున్నారు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. హీరోయిన్ సమంత తో లవ్ అంటూ టాక్ బయటకు వచ్చినా..వీరు మాత్రం పెళ్లి చేసుకోలేదు. కలిసి మీడియా కంట కనపడ్డ..ఫ్రెండ్స్ అని కూడా చెప్పి కవర్ చేయలేదు.
వన్ ఫైన్ డే..శ్రీకాళహస్తీ లో పూజాలు చేస్తూ..రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కొన్నాళ్లు మీడియాలో హాట్ టాపిక్ గా నడిచిన ఈ జంట..ఆ తరువాత చద్ది చప్పుడు లేకుండా విడిపోయారు. ఆ తరువాత సమంత అక్కినేని ఇంటి కోడలు గా వెళ్ళడం ..డివర్స్ తీసుకోవడం రెండు జరిగిపోయాయి. ఇక ఆ తరువాత హీరో సిద్దార్థ్ చేతికి వచ్చిన సినిమాలు చేసినా..ప్రయోజనం లేకుండా పోయింది.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మహా సముద్రం సినిమా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టేసింది. అయితే, సినిమా ఫ్లాప్ అయినా..లవ్ వర్క్ అవుట్ అయ్యిన్నట్లుంది అంటున్నారు జనాలు. ఎందుకంటే, హీరో సిద్దార్థ్ ఆ సినిమా లో హీరోయిన్ గా చేసిన అందాల భామ అదితి రావు హైదరి తో లవ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా వీరిద్దరూ జంటగా ముంబైలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరాకి చిక్కారు. అంతేనా..తమ ఫోటో లని క్లిక్ మనిపించిన కెమారా మ్యాన్ లకు వార్నింగ్ కూడా ఇచ్చారు.
దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా టాలీవుడ్ లో ఆమె ఫుల్ మార్క్స్ కొట్టేసింది. మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి అంతరిక్షం అనే సినిమాలో నటించి..తన సైలెంట్ యాక్టింగ్ తో అభిమానులను ఫిదా చేసింది. అవకాశం వచ్చినప్పుడల్లా తనని తాను నిరూపించుకుంటూనే ఉంది. ఇప్పుడు సిద్ధార్ధ్ తో డేటింగ్ అనేసరికి..మరో సమంత లా మారబోతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.