Moviesవివిధ భంగిమల్లో శ్రావణ భార్గవి..కళ్లు నెత్తికెక్కాయా..ఫైర్ అయిన అన్నమయ్య వంశస్తుడు..!!

వివిధ భంగిమల్లో శ్రావణ భార్గవి..కళ్లు నెత్తికెక్కాయా..ఫైర్ అయిన అన్నమయ్య వంశస్తుడు..!!

టాలీవుడ్ లో మంచి ప్లే బ్యాక్ సింగర్ గుర్తింపు తెచ్చుకున్న శ్రావణ భార్గవి అంటే అందరికి చాలా ఇష్టం. ఆమె పాడే పాటలను చాలా మంది జనాలు లైక్ చేస్తారు. ఓ ఢిఫరెంట్ వాయిస్ తో..హస్కీ గా ..తన పాటతోనే మత్తెక్కిస్తుంది. ఈమె ప్రముఖ సింగర్ హేమ చంద్ర భార్య అని మనకు తెలిసిందే. ఇద్దరు కలిసి స్టేజ్ సో లు ఇచ్చే టైంలోనే ..ప్రేమించుకుని..ఇంట్లో పెద్దలను ఒప్పించి..గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఓ పాప కూడా ఉంది.

ఈ మధ్యనే వీళ్ళు డివర్స్ తీసుకోబోతున్నారంటూ ఓ వార్త కూడా హల్ చల్ చేసింది. ఆ వార్త రూమర్ అని కొందరు..కాదు కాదు నిజమే అని మరికొందరు చర్చించుకుంటుండగా..ఇప్పుడు శ్రావణ భార్గవి మరో వివాదంలో చిక్కుకుంది. శ్రావణ భార్గవి..ఓ యూట్యూబ్ ఛానెల్ ని నడుపుతుంది. అందులో ఆమె తన డైలీ వ్లాగ్స్ తో పాటు, ఫ్యాషన్,ట్రావల్..పాటలు ఇలా,,అని తన వ్యూవర్స్ కి చూయిస్తుంటుంది.

కాగా రీసెంట్ గా ఆమె అన్నమయ్య రాసిన ‘ఒకపరికొకపరి వయ్యారమై…’ కీర్తనను తన దైన స్టైల్ లో పాడింది. నో డౌట్ శ్రావణ భార్గవి చాలా చక్కగా పాడింది. జనాలకు బాగా నచ్చింది. అతి కొద్ది టైంలోనే ఎక్కువ వ్యూయ్స్ కూడా వచ్చాయి. ఆల్ హ్యాపీస్ అనుకుంటున్న టైంలో బిగ్ బాంబ్ పేల్చారు కొందరు అన్నమయ్య భక్తులు. పాట పాడడం వరకు బాగానే ఉంది. ఆ పాటలో ఆమే నటించడమే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా అయిపోయింది. ఇంటిలో క్యాజువల్ గా ఓ మహిళ ఏం చేస్తుందో అవన్నీ శ్రావణ భార్గవి ఈ వీడియోలో చేస్తూ పాట పాడుతూ కనిపించింది. ప భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాడి చిత్రీకరించడం పట్ల తప్పుబట్టారు.

అలాగే ఆమె అందాన్ని వర్ణించడానికి ఆ కీర్తనను ఉపయోగించటం తప్పు అని ఆగ్రహిస్తున్నారు. శ్రావణ భార్గవి వీడియోను వేర్వేరు గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేస్తూ తిట్టిపోస్తున్నారు. కొందరు కళ్లు నెత్తికెక్కాయా అంటూ తిడుతుంటే..మరికొందరు ఆమె చేసిన దానిలో తప్పేముంది.. ఇంకా చాలా మంది అన్నమయ్య పాటలను తప్పుగా వాడుకున్నారు..వాళ్ళ మీద అరవండి,,అంటూ శ్రావణ భార్గవికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయంపై శ్రావణ భార్గవితో మాట్లాడితే ఆమె బాధ్యతరాహిత్యంగా సమాధానిచ్చిందని ..ఈ విషయాన్ని టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని, అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్తామని అన్నమయ్య వంశస్తుడు హరినారాయణ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news