అగ్ర దర్శకుడు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ దేవదాసు. ఈ సినిమాతో గోవా బ్యూటీ ఇలియానా తెలుగు తెరకు పరిచయం అయింది. మరో అగ్ర నిర్మాత కొడుకు రామ్మ్ పోతినేని కూడా ఇదే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటిరోజు ఫ్లాప్ టాక్ వచ్చింది. మాటిమాటికీ పాట వస్తూ విసిగిస్తుందని కామెంట్స్ చేశారు. కానీ, నెమ్మదిగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇదే సినిమా మ్యూజికల్‌గా సూపర్ హిట్. చక్రి సంగీతం అందించిన పాటలన్నీ ఆకట్టుకున్నాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఆ తర్వాత ఇదే ఇలియానా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. పూరికి కనెక్ట్ అయితే ఆ హీరోను గానీ, హీరోయిన్‌ను గానీ బాగా రిపీట్ చేస్తుండారు. దీనికి ఉదాహరణ రవితేజ, హీరోయిన్లు రక్షిత, ఇలియానా, ఆశిన్, కాజల్ అగర్వాల్ లాంటి వారే. తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది ఇలియానా పూరి జగన్నాథ్ తోనే. మహేశ్ బాబు – ఇలియానాల పోకిరి, రానా దగ్గుబాటి – ఇలియానాల నేను నా రాక్షసి, రవితేజ – ఇలియానాల దేవుడు చేసిన మనుషులు..ఇవన్నీ పూరి డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలే.
పూరి సినిమాలతో హీరోకి విపరీతమైన మాస్ ఇమేజ్ ఎలా వస్తుందో..హీరోయిన్స్‌కి అలా గ్లామర్ బ్యూటీగా మంచి పర్ఫార్మర్‌గా పేరొస్తుంది. అయితే, తెలుగులో కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్‌గా అప్పట్లో ఇలియానా తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇలియానా నటిస్తే సినిమా హిట్ అనే మాట గట్టిగా వినిపించేది. అయితే, ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఇలియానా ఒక్కసారిగా కెరీర్ ఇబ్బందుల్లో పడటానికి కారణం ఓ టాలీవుడ్ హీరో అని ప్రచారం జరిగింది.
ఆ హీరో కలిసి ఒక సినిమా మాత్రమే నటించిన ఇలియానా..ప్రేమలో పడిందని టాక్ వినిపించింది. అంతేకాదు, టాలీవుడ్ టాల్ హీరో అంటూ ప్రేక్షకులు పిలుచుకునే ఆ హీరోతో ప్రేమలో ఉండటం వల్ల సరైన కథలు ఎంపిక చేసుకునే విషయంలో కూడా దృష్ఠి పెట్టలేకపోయిందని..పెద్దింటి హీరో కాబట్టి అతన్ని పెళ్లి చేసుకుంటే లైఫ్ సాఫీగా సాగుతుందని భావించిన ఇలియానా తీరా పెళ్లి మ్యాటర్ వచ్చే సరికి సదురు హీరో సైలెంట్ అయ్యాడని కథనాలు వచ్చాయి.
దాంతోనే ఇలియానా డిప్రషన్‌లోకి వెళ్ళి సినిమాలపై దృష్ఠిపెట్టలేదని..అందుకే టాలీవుడ్‌లో తన కెరీర్ దెబ్బైపోయిందని చెప్పుకున్నారు. ఇప్పటికీ ఆ మాట వినిపిస్తుంది. లేదంటే కాజల్, నయనతార, తమన్నాల మాదిరిగా ఇలియానా కూడా ఇంకా తెలుగు సినిమాలలో నటిస్తూ ఉండేది.