నందమూరి నటసింహం బాలకృష్ణ జెట్ రాకెట్ స్పీడ్‌తో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అఖండతో బాక్సాఫీస్ దగ్గర గర్జించేశారు. ఇప్పుడు మలినేని గోపీ దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు. ఆ వెంటనే అనిల్ రావిపూడి సినిమా ఉంది. ఆ వెంటనే పూరి జగన్నాథ్ సినిమా కూడా ఉంది. బాలయ్య స్పీడ్ అయితే మామూలుగా లేదు. ఇక బాలయ్యతో మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు కూడా కొందరు యంగ్ హీరోలు రెడీగా ఉన్నారు. అయితే సరైన కథ, డైరెక్టర్ సెట్ కాకపోవడంతో బాలయ్య మల్టీస్టారర్ సినిమాలు పట్టాలు ఎక్కడం లేదు.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ – బాలయ్య కాంబినేషన్లో కూడా ఓ మల్టీస్టారర్ అనుకున్నారు. ఈ ఆలోచన కూడా బాలయ్యదే. ఆ సినిమాకు బాలయ్యే స్వయంగా ఓ డైరెక్టర్‌ను కూడా అనుకున్నారు. అయితే ఆ కాంబినేషన్ పట్టాలు ఎక్కలేదు. బాలయ్యే స్వయంగా పూనుకున్నా ఈ ప్రాజెక్టు ఎందుకు పట్టాలెక్కలేదు. ఏం జరిగిందో చూద్దాం.
బాలయ్య వందో సినిమాకు అప్పుడే డిస్కర్షన్లు నడుస్తున్నాయి. ఎలాంటి కథ ఎంచుకోవాలి ? దర్శకుడిగా ఎవరు ఉంటే బాగుంటుంది ? అన్న దానిపై చాలాపేర్లే వినిపించాయి. పూరి జగన్నాథ్ తాను తీస్తానని అన్నాడు. బాలయ్యకు పూరి స్టైల్ కథ నొప్పదన్న డౌట్‌తో బాలయ్య రైతు కథ రెడీ చేసుకుని కృష్ణవంశీకి కాల్ చేశారు. కృష్ణవంశీ అప్పుడే దిల్ రాజు బ్యానర్లో రుద్రాక్ష సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే బాలయ్య వందో సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో దిల్ రాజే స్వయంగా కృష్ణవంశీతో మన సినిమా తర్వాత చేద్దామని చెప్పి బాలయ్య సినిమా కోసం పంపారు.
కట్ చేస్తే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అమితాబచ్చన్ ఉండాలని బాలయ్య స్వయంగా పట్టుబట్టారు. అమితాబ్‌ను ఒప్పించాలని చూశారు. అయితే అప్పుడు ఆయన ఆరోగ్య కారణాలతో పాటు ఇతర సినిమాలకు ఇచ్చిన కమిట్‌మెంట్స్‌తో తాను చేయలేనని సారీ చెప్పేశారు. అదే టైంలో సబ్జెక్ట్‌లోనూ కొన్ని డౌట్లు వచ్చాయి. అప్పుడు బాలయ్య అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
రైతు కథ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది.. ప్రభుత్వంపై పోరాటం చేసే విధంగా ఉంటుంది. ఈ కథలో వచ్చిన డిస్కర్షన్లు… సందేహాలు.. అటు అమితాబచ్చన్ ఈ సినిమా కోసం డేట్లు ఇవ్వలేకపోవడంతో చివరకు ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. అప్పుడు ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన చక్రవర్తి జీవిత చరిత్ర ఆధారంగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తెరకెక్కింది.