కోలీవుడ్ కొత్త జంట..నయన్-విగేశ్ శివన్..యమ జోరు మీద ఉన్నారు. పెళ్లికి ముందు వాళ్ల కెరీర్ ఎలా ఉన్నా..ఎఫైర్స్ ఎలా సాగినా..పెళ్లి తరువాత మాత్రం కధ ఓ రేంజ్ లో పోతుంది. అలా ఇలా కాదండో..జెట్ స్పీడ్ లో సినిమాలకు సైన్ చేస్తూ..హీరోయిన్ గా భార్య, డైరెక్టర్ గా భర్త ఇద్దరు రెండు చేతులా సంపాదిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు అఫిషీయల్ భార్య భర్తలుగా తిరుగుతున్నారు.
తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో..గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ఈ జంట..ఆ తరువాత వెంకన్న ఆశీర్వాదాలు తీసుకుని..కొత్త జీవితాని ప్రారంభించారు. ఆ తరువాత వీళ్ళ హనీ మూన్ ఫోటోలు ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయో మనకు తెలిసిందే. మెడలో తాళ్లి తో నయన్..ఆమె ను ప్రేమగా ముద్దాడుతున్న విగ్నేశ్ శివన్..అబ్బో..దాని గురించి ఎంత చెప్పినా తక్కువే.
అయితే, హనీమూన్ తరువాత సరాసరి తన నెక్స్ట్ సినిమా అట్లీ తో తెరకెక్కబోతున్న మూవీ షూటింగ్ కి వెళ్లిపోయిన నయన్..ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. ఇన్నాళ్ళు దీని గురించి మీడియాలో వార్తలు వస్తున్నా కానీ, ఇప్పుడు అఫిషీయల్ గా ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో టాప్ హీరోయిన్గా రాణించిన నయనతార..
తాజాగా 75వ చిత్రం ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించనుండగా.. సత్యరాజ్, జై కీలక పాత్రలో నటించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో పెళ్లి తరువాత ఇక కొత్త సినిమాలకు సైన్ చేయదు అని అనుకున్న ఫ్యాన్స్ కి ఇది నిజంగా గుడ్ న్యూస్ గా మారింది.