వామ్మో శ్రీ రెడ్డి గురించి ఎవ్వరూ తెలిసి తెలిసి ఆమెతో పెట్టుకోరు. ఆమెతో పెట్టుకుంటే ఆమె ఎంతకు అయినా తెగించేస్తుందన్నది అందరికి అర్థమైపోయింది. కాస్టింగ్ కౌచ్ విషయంపై పోరాటంతో పాపులర్ అయిన శ్రీరెడ్డి ఆ తర్వాత కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు సంబంధించిన అంశాలతో పాటు అనేకానేక అంశాలపై సోషల్ మీడియా వేదికగా ఓపెన్‌గానే స్పందిస్తోంది.
ఏ పార్టీ అయినా.. ఏ రాజకీయ నేత అయినా.. ఇటు సినిమాల్లో మెగా ఫ్యామిలీ నుంచి నాని వరకు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాల్లోనూ ఆమే దూరేస్తోంది. చివరకు పవిత్రా లోకేష్ – నరేష్ విషయంలో తలదూర్చి పవిత్రా లోకేష్‌ను ఆటాడుకుంది. శ్రీ రెడ్డి ఏం చేసినా సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. ఆమెకు ఫేస్‌బుక్‌లోనే ఏకంగా 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
ప్రస్తుతం చెన్నైలో ఉంటూ యూట్యూబ్ వీడియోలు, అటు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలం గడుపుతోన్న శ్రీ రెడ్డి తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. రొటీన్‌కు భిన్నంగా శ్రీరెడ్డి యూట్యూబ్ ఇంటర్వ్యూ సాగింది. యాంకర్ ఇచ్చిన చాలెంజ్ టాస్క్‌లను శ్రీ రెడ్డి సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసింది. శ్రీ రెడ్డి రాత్రి వేళల్లో రోడ్లపై వెళుతున్న వాహనాలు ఆపి.. వాళ్ల ఫోన్ నెంబర్లను తీసుకురావాలి.
శ్రీ రెడ్డి రాత్రి వేళల్లో రోడ్ల మీద వెళుతోన్న వాహనాలు ఆపి ఫోన్ నెంబర్లు అడిగిన వెంటనే కొందరు ఆమెకు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. కొందరు వాహనదారులు మాత్రం శ్రీ రెడ్డిని చూసి షాక్ అయ్యారు. అలా మొత్తానికి ఈ టాస్క్ అయితే ఆమె పూర్తి చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.