బాలీవుడ్ స్టార్ కిడ్..హాట్ బ్యూటీ..స్టార్ హీరో భార్య అలియా భట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. తన నటన తో అందంతో కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టిన ఈ బ్యూటి..ఇప్పుడు తల్లి కాబోతుంది. ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. కాకపోతే ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటంటే.. పెళ్లైన రెండు నెలలకే ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం విశేషం.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని ఎంతో ఇష్టంగా ప్రేమించి ఏప్రిల్ 14న చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న అలియా అంటే బాలీవుడ్ లో అదో క్రేజ్..ఎలాంటి రోల్ నైన ఇట్టే పట్టేసి అభిమానులను మెప్పించగలదు. అలాంటి అలియా ఇలా పెళ్ళైన రెండు నెలలకే గర్భవతి అని తెలియడంతో..అభిమానులు షాక్ అయ్యారు. కొందరు విపరీతంగా ట్రోల్స్ చేశారు.
అయితే, ఇలాంటి వాటికి గట్టిగా ఆన్సర్ ఇచ్చింది అలియా. రీసెంట్ గా ఆమె మీడియాతో మాట్లాడుతూ ..” తన లైఫ్ గురించి..తనకు క్లారిటీ ఉందని..తాను ఏం చేస్తున్నానో తెలిసే చేస్తున్నానని..నాకు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి..పిల్లల్ని ఎప్పుడు కనాలి అనే దాని పై ఓ లెక్క ఉందని..నేను 30ల్లో పెళ్లి చేసుకుంటాను ఏమో అని..చాలా మంది భయపడ్డారని.. కానీ ఏదీ మన చేతుల్లో ఉండదు ..ఆ సమయమొచ్చినప్పుడు అది జరిగి తీరుతుంది అని “,,ఆలియా అంటోంది. అంతేకాదు..”పిల్లల్ని కనాలన్న ఆలోచన వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నానని స్పష్టం చేసింది ఈ యంగ్ బ్యూటీ.