టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ ఇద్దరు స్టార్ హీరోలు త్వరలోనే తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ముందుగా చిరు నటిస్తోన్న మళయాళ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ గాడ్‌ఫాథర్ విజయ దశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు. అటు బాలకృష్ణ నటిస్తోన్న 107వ సినిమాకు మలినేని గోపీచంద్ దర్శకుడు. కంప్లీట్ మాస్ యాక్షన్ సినిమాగా వస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు.
ఈ ఇద్దరు అగ్ర హీరోల సినిమాల మధ్య ఎప్పుడూ కంపేరిజన్ వస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే చిరు, బాలయ్య సినిమాల లేటెస్ట్ లుక్స్‌పై కూడా ఇప్పుడు కంపేరిజన్లు స్టార్ట్ అయ్యాయి. సహజంగానే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో రెండు ఫస్ట్ లుక్స్ పెట్టి ఏది మీకు బాగా నచ్చిందన్న పోల్స్ కూడా నడుస్తుంటాయి. ఇప్పుడు ఈ రెండు లుక్స్ కంపేరిజన్స్‌లో బాలయ్య ఫస్ట్ లుక్ చాలా పవర్ ఫుల్‌గా ఉందని అంటున్నారు.
బాలయ్య బ్లాక్ డ్రెస్… బ్యాక్ గ్రౌండ్ కూడా అంతా బ్లాక్‌గా ఉండడంతో బాలయ్య కుర్చీలో కూర్చొని చాలా పవర్ ఫుల్‌గా ఉన్నాడు. బాలయ్య స్టైలీష్‌గా, పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్‌తోనే సినిమా ప్రామీసింగ్‌గా కనిపిస్తోంది. ఇక చిరంజీవి గాడ్ ఫాథర్ ఫస్ట్ లుక్ విషయానికి వస్తే దీనికి కూడా మంచి రెస్పాన్సే ఉంది. అయితే అఖండ లాంటి భయంకరమైన హిట్ తర్వాత వస్తోన్న బాలయ్య సినిమా కావడంతో బాలయ్య లుక్‌పై ఎక్కువ ట్రెండ్ నడుస్తోంది.
ఇటు ఆచార్య లాంటి ప్లాప్ తర్వాత వస్తోన్న సినిమా.. అది కూడా రీమేక్ కావడంతో చిరు ఫస్ట్ లుక్‌కు బాలయ్యతో పోలిస్తే కాస్త హైప్ తక్కువుగా కనిపిస్తోంది. ఎందుకో ఆచార్య లుక్ విషయంలోనూ అనుకున్నంత హైప్ రాలేదు. అయితే చిరు ఎంట్రీ పవర్ ఫుల్‌గానే ఉన్నా చిరు జుట్టు కలర్, డ్రెస్సింగ్ స్టైల్‌పై కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరుది పొలిటికల్ పాత్ర.. లూసీఫర్‌లో మెహన్‌లాల్ వైట్ అండ్ వైట్ లో కనిపిస్తాడు.
అయితే గాడ్ ఫాథర్‌లో చిరుకు బ్లాక్ ఎందుకు వేశారని.. ఈ డ్రెస్ వల్ల కూడా లుక్‌కు అంత లుకింగ్ రాలేదని మెగాఫ్యాన్స్‌లోనే కొందరు డిజప్పాయింట్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కామెంట్లు కూడా బాలయ్య లుక్‌కే కాస్త ఎక్కువుగా స్పందిస్తున్నారు. రెండు లుక్‌లలో ఏది బాగుందన్న ఆన్‌లైన్ ఓటింగ్‌లకు కూడా బాలయ్య లుక్‌కు సరాసరీ 60 % ఓటింగ్ పడుతుంటే.. చిరు లుక్‌కు 40 – 45 % ఓటింగ్ పడుతోంది. ఏదేమైనా ఫస్ట్ లుక్ విషయంలో బాలయ్యదే కాస్త పైచేయిగా కనపడుతోంది.