Moviesఫ‌స్ట్ లుక్ గెట‌ప్‌తో చంపేసిన మెగాస్టార్‌... గాడ్‌ఫాద‌ర్ ఫ‌స్ట్ లుక్ ప‌వ‌ర్...

ఫ‌స్ట్ లుక్ గెట‌ప్‌తో చంపేసిన మెగాస్టార్‌… గాడ్‌ఫాద‌ర్ ఫ‌స్ట్ లుక్ ప‌వ‌ర్ ఫుల్‌.. (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ యేడాది మార్చిలో ఆచార్య సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఆచార్య డిజ‌ప్పాయింట్ చేసింది. ఈ సినిమా త‌ర్వాత చిరు చేతిలో ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి. ముందుగా మ‌ళ‌యాళ హిట్ మూవీ లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా గాడ్‌ఫాద‌ర్ సినిమా వ‌స్తోంది.

ఆ వెంట‌నే లైన్లో మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేస్తోన్న కోలీవుడ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ భోళాశంక‌ర్‌, బాబి డైరెక్ట్ చేస్తోన్న వాల్తేరు వీర‌య్య, వెంకీ కుడుముల సినిమాల‌తో పాటు సీనియ‌ర్ హీరోయిన్ రాధిక బ్యాన‌ర్లో ఓ సినిమా చేసేందుకు కూడా చిరు డేట్లు ఇచ్చారు. ఇలా చిరు నుంచి వ‌రుస సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటిల్లో ముందుగా గాడ్‌ఫాద‌ర్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

మోహన్ రాజా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాగా వ‌స్తోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తాజాగా రిలీజ్ అయ్యింది. చిరంజీవి కారులో నుంచి దిగే ప‌వ‌ర్ ఫుల్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. చిరు ఫ‌స్ట్ టైం స్పోర్ట్స్ సాల్ట్ & పెప్ప‌ర్ లుక్‌లో క‌నిపించాడు. ఫ‌స్ట్ లుక్‌తోనే చిరు పాత్ర ఈ సినిమాలో ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుందో క్లారిటీ వ‌చ్చేసింది. చిరు కారు దిగుతుంటే సునీల్ కారు డోర్ ఓపెన్ చేసి ప‌క్క‌నే ఉంటాడు.

బ‌య‌ట చిరు కోసం కార్య‌క‌ర్త‌లు వెయిట్ చేస్తున్న‌ట్టుగా చూపించాడు. ఎలివేష‌న్‌తో పాటు థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం.. చిరంజీవి గెట‌ప్ అన్ని చూస్తుంటే చిరు సినిమాకు పాజిటివ్ వైబ్స్ క‌నిపిస్తున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తుండగా, నయనతార హీరోయిన్గా న‌టిస్తోంది. కొణిదెల సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్‌బి చౌదరి మరియు ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ద‌స‌రాకు సినిమా రిలీజ్ చేస్తున్న‌ట్టు చివ‌ర్లో మేక‌ర్స్ చెప్పేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news