Movies'బింబిసార ' భారీ ట్రైల‌ర్ ... క‌ళ్యాణ్‌రామ్ న‌ట‌విశ్వ‌రూపం ( వీడియో)

‘బింబిసార ‘ భారీ ట్రైల‌ర్ … క‌ళ్యాణ్‌రామ్ న‌ట‌విశ్వ‌రూపం ( వీడియో)

నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది. కొత్త ద‌ర్శ‌కుడు వాశిష్ట మ‌ల్లిడితో చేసిన బింబిసార స్టార్ట్ చేసి కూడా చాలా రోజులు అయ్యింది. క‌ళ్యాణ్‌రామ్ కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇవ్వ‌డం.. అత‌డిని న‌మ్మి భారీ పెట్టుబ‌డి పెట్ట‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. క‌ళ్యాణ్‌రామ్ రిస్క్ చేస్తున్నాడ‌ని కొంద‌రు అన్నారు. కానీ ఈ రోజు రిలీజ్ అయిన ట్రైల‌ర్ చూస్తే ఆ అనుమానాలు అన్ని ప‌టాపంచ‌లు అయిపోయాయి.

రెండున్న‌ర నిమిషాల పాటు సాగిన ట్రైల‌ర్లో భారీ విజువ‌ల్స్, అదిరిపోయే మేకింగ్‌, టెక్నిక‌ల్ ప‌రంగా ఎక్క‌డా రాజీలేక‌పోవ‌డం.. బ‌ల‌మైన క‌థ‌, క‌థ‌నాలు అన్నీ పుష్క‌లంగా క‌నిపించాయి. ట్రైల‌ర్ చాలా భారీగా ఉంది. ఇక ట్రైల‌ర్ చూస్తే పున‌ర్జ‌న్మ‌ల కాన్సెఫ్ట్‌తో పాటు ఇటు ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోకు లింక్ పెట్టి న‌డిపించిన‌ట్టుగా ఉంది.

అటు పున‌ర్జ‌న్మ‌ల‌కు, ఇటు ఇప్ప‌టి కాలానికి మ‌ధ్య‌లో ఓ నిధితో పాటు విల‌న్ ప్ర‌పంచాధిప‌త్యం సాధించ‌డం.. ఇవ‌న్నీ కూడా ట్రైల‌ర్లో చూపించారు. క‌థే భారీగా ఉంది. దీనికి తోడు విజువ‌ల్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. క‌ళ్యాణ్‌రామ్ అటు బింబిసారుడిగాను.. ఇటు ఇప్ప‌టి హీరోగాను బాగా క‌నిపించాడు. అత‌డి వాయిస్‌లో బేస్ బాగుంది.

క‌ళ్యాణ్‌రామ్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని.. ఎవ్వ‌రూ చూపించ‌ని రీతిలో బింబిసార పాత్ర ఉంది. కీరవాణి నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. అటు సినిమాటోగ్ర‌పీ, ఇటు భారీ సెట్టింగులు ఇలా ట్రైల‌ర్ అంతా భారీగానే ఉంది. ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే అని కళ్యాణ్ రామ్ చెప్పడంతోనే అత‌డి పాత్ర రేంజ్ ఏంటో తెలుస్తోంది.

ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా – సంయుక్త మీనన్ వారీనా హుస్సేన్ హీరోయిన్లుగా న‌టించారు.ఈ సినిమా ఆగ‌స్టు 5న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమా క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news