సినిమా రంగంలో ఒక హీరో చేయాల్సన సినిమాను మరో హీరో చేయడం కామన్. అయితే ఆ సినిమా హిట్ అయితే ఫస్ట్ వదులుకున్న హీరో దురదృష్టం అంటారు.. ప్లాప్ అయితే అతడు చాలా లక్కీ అంటూ ఉండడం కామన్. ఈ క్రమంలోనే అక్కినేని వంశంలో మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. నాగచైతన్యను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తన బ్యానర్లో తెరకెక్కిన జోష్ సినిమాతో వెండితెరకు గ్రాండ్‌గా పరిచయం చేశాడు. వాసువర్మ ఈ సినిమాకు దర్శకుడు.
కాలేజ్ నేపథ్యం, గొడవలతో తెరకెక్కిన ఈ కథ విన్నవెంటనే దిల్ రాజుకు ఒక్కసారిగా నాగార్జున శివ గుర్తుకు వచ్చిందట. అరే ఈ టైప్‌లో సినిమా వచ్చి చాలా రోజులైంది కదా ? అని నచ్చడంతో రామ్‌చరణ్‌కు చెప్పారట. అప్పుడు మగధీర సినిమా అండర్ ప్రాసెస్‌లో ఉంది. చరణ్‌కు ఈ కథ బాగా నచ్చింది. అయితే చిరంజీవికి కథ నచ్చినా మగధీర ఎంత భారీగా తెరకెక్కుతుందో ? తనకు తెలుసు.. ఇంత భారీ తర్వాత ఈ సినిమా తీస్తే ఎంత వరకు కనెక్ట్ అవుతుందన్న దానిపై కొంత సందేహం వ్యక్తం చేయడంతో పాటు తర్వాత రోజు నిర్ణయం చెపుతానన్నారట.
మరుసటి రోజు చిరు దిల్ రాజుకు స్వయంగా ఫోన్ చేసి నాగబాబుకు చెప్పమని సూచించడంతో నాగబాబు కూడా కొన్ని సందేహాలు వ్యక్తం చేశారట. చివరకు ఇదే కథను నాగార్జునకు చెప్పగా నాగ్ ఓకే చేయడంతో చైతు డెబ్యూ మూవీగా జోష్ వచ్చింది. అయితే ఇంతకంటే ముందు చైతును పరిచయం చేసేందుకు దిల్ రాజు నాగార్జున చుట్టూ తిరిగారట. కొత్తబంగారు లోకం సినిమాతో చైతును హీరోగా పరిచయం చేయాలన్నది దిల్ రాజు ప్లాన్.
అయితే ఓ లెజెండ్రీ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా వస్తోన్న చైతుకు ఇంత సాఫ్ట్ కథ కన్నా కాస్త యూత్‌కు కనెక్ట్ అవ్వడంతో పాటు యాక్షన్ కూడా ఉండే కథ ఉంటే బాగుంటుందని నాగ్ చెప్పారట. అదే టైంలో అటు జోష్ కథను మెగా కాంపౌండ్ రిజెక్ట్ చేయడంతో అదే కథను నాగార్జునకు చెప్పారట. ఈ కథకు నాగ్ ఓటేయడంతో అలా చైతు డెబ్యూ మూవీగా జోష్ వచ్చి చేరింది. ఇక్కడే నాగ్ అంచనాలు తప్పాయి.
బ్యాడ్‌లక్ ఏంటంటే దిల్ రాజు డెసిషన్ మేరకు వెళ్లి ఉంటే కొత్తబంగారు లోకం లాంటి సూపర్ హిట్ సినిమాతో యూత్‌కు పిచ్చగా కనెక్ట్ అయిపోతూ నాగచైతన్య ఎంట్రీ ఉండి ఉండేది. అయితే జోష్ లాంటి ప్లాప్ సినిమాతో చైతు ఎంట్రీ ఇచ్చాడు. అదే కొత్తబంగారు లోకం సినిమాతో హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ చాలా రోజుల వరకు అదే సినిమా పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు.