Moviesహేమ‌చంద్ర - శ్రావ‌ణి భార్గ‌వి ప్రేమ‌కు ఆ సినిమాతోనే బీజం ప‌డిందా.....

హేమ‌చంద్ర – శ్రావ‌ణి భార్గ‌వి ప్రేమ‌కు ఆ సినిమాతోనే బీజం ప‌డిందా.. సూప‌ర్ ట్విస్ట్‌లే..!

తెలుగు సింగ‌ర్లో హేమ‌చంద్ర‌, శ్రావ‌ణ భార్గ‌వి విడాకులు తీసుకుంటున్నారు.. విడిపోతున్నారంటూ సోష‌ల్ మీడియాను ఒక్క‌టే వార్త‌లు ఊపేస్తున్నాయి. స‌రే ఇవి నిజ‌మా ? అబ‌ద్ధాలా ? అనేది కాల‌మే చెప్పాలి. లేక‌పోతే వాళ్లిద్ద‌రే చెప్పాలి. కాసేపు ఇవి ప‌క్క‌న పెట్టేస్తే అస‌లు వీరిద్ద‌రి ప్రేమ‌క‌థ‌కు ఎలా ? ఎక్క‌డ బీజం ప‌డిందో వారు గ‌తంలో చెప్పిన ఇంట‌ర్వ్యూ ప్ర‌కార‌మే చూస్తే చాలా ఆస‌క్తి అనిపిస్తుంది వీరి ల‌వ్‌స్టోరీ.

రైడ్ సినిమా రీరికార్డింగ్ జ‌రుగుతుండ‌గా ఓ లేడీ సింగ‌ర్ కోసం హేమ‌చంద్ర ట్రై చేస్తున్నాడు. ఎవ‌రి ద్వారానో శ్రావ‌ణ భార్గ‌వి నెంబ‌ర్ దొరికితే ఫోన్ చేశాడు. క‌రెక్టుగా ఉగాది రోజు అది కూడా 2009 సంవ‌త్స‌రంలో శ్రావ‌ణ భార్గ‌వి హేమ‌చంద్ర ఇంటికి వెళ్లింది. ఎందుకో గాని తొలి రోజు.. తొలి ప‌రిచ‌యంలోనే హేమ‌చంద్ర ఆమెకు ప‌డిపోయాడ‌ట‌. వ‌న్ సైడ్ ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ అన్న‌ట్టుగా హేమ‌చంద్ర ప‌రిస్థితి.

రోజు రోజుకు పెరుగుతోన్న ప‌రిచ‌యంలో మ‌న‌సులు క‌లుస్తున్నాయ్‌.. హేమ‌చంద్ర త‌న‌ను ల‌వ్ చేస్తున్నాడ‌న్న విష‌యం భార్గ‌వికి కూడా అర్థ‌మైంది. అయితే తానే ముందు చెపుతాడులే.. నేను ఎందుకు కంగారు ప‌డాల‌న్న‌ట్టుగా ఆమె బెట్టు చేస్తూ ల‌వ్‌లో థ్రిల్‌ను ఎంజాయ్ చేస్తోంది. హేమ‌చంద్ర ప‌గ‌లంతా ఫోన్ మెసేజ్‌ల‌తో ఆమెను విసిగిత్తేంచేవాడు. రాత్రి 9 అయితే ఆమె మెసేజ్‌కు రిప్లే ఇచ్చేది కాద‌ట‌. ఇటు హేమ‌చంద్ర‌లో త‌న ల‌వ్‌ను ఒప్పుకోదేమోన‌న్న టెన్ష‌న్ ఉండేద‌ట‌. మెసేజ్‌కు రిప్లే ఇవ్వ‌వేంట‌ని అడిగితే రాత్రి 9 దాటిందిగా అనే ఆన్స‌ర్ వ‌చ్చేద‌ట‌.

శ్రావ‌ణ భార్గ‌వికి మాత్రం ప్రేమ‌లో ప‌డిన కొత్త‌లో కంటిన్యూగా మాట్లాడితే ఏం అనుకుంటారో అని కాస్త అల‌క‌బూనిన‌ట్టు యాక్ట్ చేసేద‌ట‌. ఇదే బాగా వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని కూడా ఆమె చెప్పింది. మొత్తానికి ఓ రోజు కాలేజ్ నుంచి ఆమెను వాళ్ల ఇంటికి ద‌గ్గ‌ర డ్రాప్ చేసి వెంట‌నే ఆమెకు ప్ర‌పోజ్ చేసేశాడ‌ట‌. వెంట‌నే శ్రావ‌ణ భార్గ‌వి అబ్బా చెప్పేశావా.. అప్పుడే చెప్పేశావా అని మారాం చేసిన‌ట్టుగా అంద‌ట‌. అయితే ఇదేంటి ప్ర‌పోజ్ చేస్తే అప్పుడే చెప్పేశావా అంటోందేంట‌ని త‌ల ప‌ట్టుకునేవాడ‌ట‌. అయితే ఆమె మాత్రం ప్ర‌పోజ్ కాస్త లేట్ అయ్యే కొద్ది ఆ థ్రిల్‌ను బాగా ఎంజాయ్ చేయ‌వ‌చ్చ‌న్న ప్లాన్‌తో ఉంది.

చివ‌ర‌కు అలా పెద్ద‌ల అంగీకారంతో వారు పెళ్లి చేసుకోవ‌డం.. ఈ దంప‌తుల‌కు ఓ బిడ్డ పుట్ట‌డం జ‌రిగింది. ఇక శ్రావ‌ణ భార్గ‌వి తండ్రి హైద‌రాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తార‌ట‌. తల్లి హౌస్‌వైఫ్‌. చిన్న‌ప్ప‌టి నుంచి ఆమెకు డ్యాన్స‌ర్ అవ్వాల‌న్న కోరిక ఉండేద‌ట‌. అయితే ఆమె త‌ల్లి కూడా సింగ‌రే. ప్రొఫెష‌న‌ల్ సింగ‌ర్ కాక‌పోయినా పాట‌లు బాగా పాడేద‌ట‌. అలా త‌ల్లి బాట‌లోనే కూతురు కూడా పాట‌లు పాడుతూ మంచి ప్రొఫెష‌న‌ల్ సింగ‌ర్‌గా ఎదిగింది.

ఇక హేమ‌చంద్ర వాళ్ల కుటుంబంలో అంద‌రూ సింగ‌ర్సే. వాళ్లంద‌రూ పాట‌లు బాగా పాడ‌తార‌ట‌. ఇక అస‌లు ప‌రిచ‌యం లేక‌ముందు నుంచే హేమ‌చంద్ర పాట‌లు అంటే శ్రావ‌ణ భార్గ‌వి తండ్రికి బాగా ఇష్టం అట‌. ఇక త‌న ప్రేమ విష‌యాన్ని ఆమె ముందుగా త‌న త‌ల్లికి చెప్పి ఒప్పించుకున్నాకే తండ్రికి చెప్పింద‌ట‌. మ‌రి ఈ జంట విడాకుల వార్త‌లు అబ‌ద్ధాలుగా మిగిలిపోవాల‌ని కోరుకుందాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news