టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే,,ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీ గా ఉంది. ఇప్పటికే తన ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డా..అయినా కానీ అమ్మడుకి అవకాడ్శాలు పుష్కలంగా వస్తున్నాయి. దానికి కారణం అమ్మడు హాట్ అందాలు అని చెప్పకతప్పదు. నటన పరంగా పూజా లో పెద్దగా చెప్పుకోతగ్గ క్వాలిటీస్ లేవు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, ఇప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తున్న ఈ అమ్మడు..ఒకప్పుడు ఒక్కటి అంటే ఒక్క హిట్ కొట్టడానికి కొన్ని ఏళ్ళు తీసుకుంది. వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూ..అందరు ఐరెన్ లెగ్ అంటున్నా ఏ మాత్రం బాధ పడకుండా, అధైర్య పడకుండా.. తనకు వచ్చిన సినిమాల్లో నచ్చిన మూవీస్ కి సైన్ చేసి..ఫైనల్ గా సక్సెస్ కొట్టింది. దువ్వాడ జగన్నాధమ్ సినిమా తో పాజిటీవ్ హిట్ అందుకున్న పూజా..తారక్ తో అరవింద సమేత వీర రాఘవ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ ని రుచి చూసింది.
ఇక అప్పటి నుంది అమ్మడు తన కెరీర్లో వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్..అన్ని బాషల్లోను ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. అయితే, రీసెంట్ గా పాల్గొన్న ఇంటర్వ్యుల్లో అమ్మడు తన గత తాలుకా ఇన్ సిడేంట్స్ ని గుర్తు తెచ్చుకుని..సంచలన కామెంట్స్ చేసింది. ‘నా కెరీర్ లో తెలుగులో వరుసగా 6 సినిమాలు హిట్ అవ్వడం బిగ్గెస్ట్ సక్సెస్ గా భావిస్తున్నా. ఇక అదే లోయేస్ట్ పాయింట్ విషయానికి వస్తే.. మొహంజోదారో మూవీ ఫ్లాప్ అవ్వడం .. నా కెరీర్ స్టార్టింగ్ లో మైనస్ అయ్యింది. నా కెరీర్ లో అది ఒక చెత్త సినిమాగా నిలిచింది. ఆ సినిమా వల్ల నాకు ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు.”..అంటూ చెప్పుకొచ్చింది.