నవ్వు నాలుగు విధాల చేటు. ఇది నిన్న మొన్నటి వరకు ప్రతి ఒక్కరు నమ్మిన మాట కానీ ఈ నానుడిని పూర్తిగా మార్చేశాడు కమెడియన్ రాజబాబు బక్కపలచని రూపంతో సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తు నవ్వులు పూయించేవాడు. సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన కమెడియన్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రాజబాబు కనిపిస్తేచాలు ప్రతి ఒక్కరిలో కూడా నవ్వు వచ్చేది. కేవలం నవ్వులతోనే లో లాఫింగ్ థెరపీ లాగా పని చేసిన అద్భుతమైన కామెడీ అని వైద్యం రాజబాబు సొంతం.
స్టార్ హీరోలతో సమానంగా పారితోషకం అందుకోవడం కూడా కేవలం రాజబాబుకి సాధ్యమైంది. కమెడియన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే హీరోగా కూడా నటించడం కూడా రాజబాబు కే సాధ్యమైంది. రాజబాబు హీరోగా పలువురు హీరోయిన్ల తో నటించాడు అందులో వాణిశ్రీ, విజయనిర్మల, శ్రీదేవి లాంటి వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ హీరోయిన్లలో శ్రీదేవి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి ఎందుకంటే శ్రీదేవి రాజబాబు మధ్య ఒక డ్యూయెట్ ఉండడం నిజంగా అప్పుడే కాదు ఇప్పటికీ ఒక సంచలనమైన విషయమే.
శ్రీదేవి ఇండియన్ సినిమాలో ఒక సుస్థిరమైన స్థానం అలాగే తన కంటూ ఒక పేజీని లిఖించుకున్న అతిలోకసుందరి. ఆమె పేరు చెబితే చాలు అప్పట్లో కుర్రకారు ఎంతగానో ఉర్రూతలూగి పోయేవారు. బాలనటిగా నటించడం మొదలు పెట్టి హీరోయిన్ గా ఆమె ఎదిగిన తీరు కూడా ఆదుతం అని చెప్పాలి. ఆమె కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో వందల సినిమాల్లో నటించారు.
ఏకంగా ఇరవై ఏళ్ల పాటు హీరోయిన్ గా నటించి మూడు తరాల హీరోలతో నటించడం అంటే అది కేవలం శ్రీదేవి కే చెల్లింది. కృష్ణ, ఎన్టీఆర్, అక్కినేని వంటి వారు కాకుండా వెంకటేష్, నాగార్జున చిరంజీవి లాంటి వారితో కూడా ఆమె ఆడి పాడి ఔరా అనిపించింది. ఇప్పటికీ అల్లు అర్జున్, నాగార్జున, మహేష్ బాబు లాంటి హీరోలకు శ్రీదేవి డ్రీమ్ గర్ల్ అని చెప్పాలి. ఇలాంటి శ్రీదేవి రాజబాబుతో ఆడి పాడింది.
అది కూడా శ్రీదేవి తొలినాల్లలోనే. 1975లో శోభన్ బాబు, మంజుల కలిసి నటించిన దేవుడు లాంటి మనిషి అనే సినిమాలో వీరిద్దరి జోడి కట్టి నటించడం విశేషం. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విశేషమేమిటంటే ఈ సినిమాలోనే మొదటిసారిగా శ్రీదేవి ఒక డ్యుయెట్ లో నటించడం. ఇక ఆ తర్వాత ఆమె తిరుగులేని హీరోయిన్ గా ఇండియన్ సినిమా స్క్రీన్‌ను తన కను సైగలతో శాసించే స్థాయికి ఎదిగిపోయింది