మెగా వారసుడు వరుణ్ తేజ్. మొదటి సినిమాతోనే తన హైట్, లుక్స్ విషయంలో ప్రామిసింగ్‌గా అనిపించాడు. అయితే కొంత సాఫ్ట్‌గా, క్లాసీగా ఉండే ముకుంద సినిమా మెగా ఫ్యాన్స్‌ని మరీ ఓ రేంజ్లో పిచ్చెక్కించేలా చేయలేకపోయింది. అయితే వరుణ్ మాత్రం తన రెండో ప్రయత్నంగా కూడా ‘కంచె’ లాంటి మంచి సినిమా చేశాడు. ప్యాన్స్ విషయం పక్కన పెడితే సినిమా లవర్స్‌ని మాత్రం బాగానే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మాస్ అంటూ చేసన లోఫర్ మనవాడికి సూట్ అవలేదు. అయితే ఇప్పుడు శ్రీనువైట్లతో కలిసి చేసిన మిస్టర్కి వరుణ్ ఇస్తున్న సపోర్ట్ నిర్మాతలందరినీ కూడా చాలా సంతోషపడేలా చేస్తోందట.
నిజానికి మిష్టర్కి వెంటనే సైన్ చేయలేదు వరుణ్. తన మొదటి సినిమాను తీసిన నల్లమలుపు బుజ్జినే ప్రొడ్యూసర్ అయినప్పటికీ రెమ్యూనరేషన్ దగ్గర కాస్త బెట్టు చేశాడు. అప్పుడు అందరూ కూడా అప్పుడే అంత అవసరమా అని కామెంట్స్ చేశారు. చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు షూటింగ్ విషయంలో నిర్మాతకు ఫుల్లుగా కో ఆపరేట్ చేస్తున్నాడని తెలుస్తోంది. బెంగుళూరుకు చాలా దూరంలో షూటింగ్ జరుగుతూ ఉండడంతో కేరవాన్ అవసరం లేదులే అని చెప్పేశాడట. అలాగే తన కాలుకు ఫ్రాక్చర్ అయినప్పటికీ షూటింగ్ కేన్సిల్ అయితే ప్రొడ్యూసర్ నష్టపోతాడని ఆలోచించి షూటింగ్ ఎలా కంప్లీట్ చేయాలని కొంచెం కష్టం అయినా ఓపికగా భరిస్తూ డైరెక్టర్‌కి హెల్ప్ చేస్తున్నాడట. ఇప్పుడిదే విషయం సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో పాటు సినిమా లవర్స్‌ని కూడా ఆకట్టుకుంటోంది. ఇలాగే కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటే వరుణ్ కూడా ఏధో ఒకరోజు కచ్చితంగా బడా స్టార్ హీరో అవుతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.