నందమూరి నటసింహం బాలకృష్ణ ఎవరికి అయినా మాట ఇస్తే ఆ మాట తప్పరు. ఇది బాలయ్యకు ఆయన తండ్రి ఎన్టీఆర్ నుంచే వచ్చిన గుణం. బాలయ్య ఎవ్వరికి అయినా సాయం చేస్తానని మాట ఇస్తే అది ఖచ్చితంగా చేసి తీరతారు. ఈ విషయంలో బాలయ్యకు ఎవ్వరూ వంక పెట్టేవారే లేరు. అలాంటి బాలయ్య ఓ యంగ్ హీరోకు ఓ మాట ఇచ్చి తప్పారట. ఈ విషయాన్ని సదరు యంగ్ హీరో తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ యంగ్ హీరో ఎవరో కాదు బాలాదిత్య. చంటిగాడు సినిమాతో హీరోగా పరిచయం అయిన బాలాదిత్య కొన్ని సినిమాలు చేశాడు.
ఇక బాలాదిత్య బాలనటుడిగానే కెరీర్ స్టార్ట్ చేశాడు. 1991లోనే ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోల చినప్పటి రోల్ చేశాడు. ఒక్క బాలకృష్ణతోనే ఏకంగా ఐదు సినిమాలు చేశాడు. బంగారు బుల్లోడు సినిమాలో ముదురు క్యారెక్టర్, టాప్‌హీరో సినిమాలో కూడా నటించాడు. చిరంజీవితో హిట్లర్, మోహన్‌బాబుతో రౌడీగారి పెళ్లాం, సంక్పలంలో జగపతిబాబు, అబ్బాయిగారు సినిమాలో చిన్నప్పటి వెంకటేష్‌గా నటించాడు.
ఇక బాలయ్యతో ఐదు సినిమాల్లో నటించడంతో బాలాదిత్యకు మంచి అనుబంధం ఏర్పడింది. బంగారు బుల్లోడు సినిమాలో బాలాదిత్య క్యారెక్టర్ పేరు ముదురు కావడంతో బాలయ్య ఎప్పుడూ మనోడిని ముదురు అని పిలుస్తుంటారట. ఈ క్రమంలోనే బాలాదిత్య బాలయ్యను ఓ కోరిక కోరాడట. బాలాదిత్య టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు ఏఎన్నార్‌తో పాటు అందరిలోనూ కలిసి నటించాడు. ఒక్క ఎన్టీఆర్‌తో నటించాలన్న కోరిక ఉన్నా తీరలేదు.
అప్పటికే ఎన్టీఆర్ సినిమాలు మానేశారు. మద్రాస్‌లో ఓ వీథిలో బాలాదిత్య వాళ్లతో పాటు ఎన్టీఆర్, దాసరి నారాయణరావు గారు ఉండేవారు. ఓ రోజు బాలయ్యతో ఎన్టీఆర్‌ను చూడాలని.. ఓ సారి ఆయన్ను కల్పించాలని కోరాడట. బాలయ్య అదేం ఉందిరా ఓకే .. ఆయన ప్రస్తుతం ఊళ్లో లేరు.. వచ్చే నెలలో చూపిస్తాను అని చెప్పారట. అయితే ఆ తర్వాత రెండు సార్లు ట్రై చేసినా బాలాదిత్యకు ఎన్టీఆర్‌ను కలవడం కుదర్లేదు.
చిరవకు ఎన్టీఆర్ కాలం చేసేయడం.. ఆయన ఆస్తికలు మద్రాస్ తీసుకురావడం జరిగాయట. బాలాదిత్య ఎన్టీఆర్ ఆస్తికలు చూసేందుకు వెళ్లారట. తర్వాత బాలయ్య బాలాదిత్యను దగ్గరకు తీసుకుని.. అరే ముదురు మాట తప్పాను .. సారీరా నిన్ను పెదాయనకు కల్పించలేకపోయానని అన్నారట. వెంటనే బాలాదిత్య ఆ టైంలో కూడా బాలయ్య తనకు ఇచ్చిన మాట గుర్తు పెట్టుకోవడంతో షాక్ అయ్యి.. అయ్యో అంకుల్ అదేం లేదని చెప్పారట.
అయితే బాలయ్య మాత్రం తర్వాత బాలాదిత్యకు ఓ సలహా ఇచ్చారట. ఇది పెద్దాయన ఎన్టీఆర్ చెప్పిన మాటే అని… మనం ఓ సీన్లో నటిస్తున్నప్పుడు డైలాగ్ చెప్పేటప్పుడు నీ కన్నులు, నీ పెదాలు, నీ ఫేస్‌లు ఎలా ఉన్నాయో అద్దం పెట్టుకుని చూసుకో .. ఎందుకంటే మన ఎక్స్ప్రెషన్స్ కోట్లాది మంది తెరపై చూస్తారు. అందుకే నువ్వు ముందుగా అద్దంలో చూసుకోమని చెప్పారట. అప్పట్లో మానిటర్లు లేకపోవడంతో సీన్‌కు ముందు ప్రతి ఒక్కరు అద్దాలనే ఆశ్రయించేవారట. అది బాలాదిత్యకు మాట ఇచ్చిన తప్పిన బాలయ్య స్టోరీ..!