నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. బాలయ్య కెరీర్లో 107వ ప్రాజెక్టుగా వస్తోన్న ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి సినిమాకు కమిట్ అయ్యాడు. అసలు అనిల్ రావిపూడి బాలయ్య కాంబోలో ఎప్పుడో నాలుగేళ్ల క్రితమే సినిమా రావాల్సి ఉంది. రామారావు గారు పేరుతో అనిల్ చెప్పిన కథ బాలయ్యకు పెద్దగా నచ్చలేదు. దీంతో ఎట్టకేలకు ఇప్పుడు అనిల్ రావిపూడి – బాలయ్య కాంబినేషన్ సెట్ అయ్యింది.
నిర్మాతగా సాహు గారపాటి అంటున్నారు.. అయితే దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్టులోకి సహ నిర్మాతగా ఎంటర్ అవుతున్నాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఎఫ్ 3తో డబుల్ హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు బాలయ్య సినిమా కోసం కొత్త తరహా కథ, కథనాలను ఎంచుకుంటున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎంపికయ్యారు. బాలయ్య కూతురు పాత్రను వర్థమాన హీరోయిన్ శ్రీలీల చేస్తోంది. శ్రీలీల లాంటి గ్లామర్ టచ్ ఉన్న హీరోయిన్ సినిమాకు ఎంతైనా స్పెషల్‌గానే ఉంటుంది. ఇక బాలయ్య భార్య పాత్రలో ప్రియమణి నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో మిత్రుడు సినిమా కూడా వచ్చింది.
ఇక ఇద్దరు హీరోయిన్లతో పాటు ఇద్దరు సీనియర్ హీరోయిన్లు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అనిల్ రావిపూడి యాంగ్రీ యంగ్‌మ్యాన్ డాక్టర్ రాజశేఖర్‌ను ఈ సినిమాలో కీలక పాత్రకు ఎంపిక చేయడంతో పాటు ఒప్పించేశాడట. ఇప్పటి వరకు ఈ పాత్ర విలన్ పాత్ర అంటూ ప్రచారం జరిగినా.. ఇప్పుడు మాత్రం కామెడీ పాత్ర అని తెలుస్తోంది.
ఈ సినిమాకు రాజశేఖర్ సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పబోతున్నాడట. ఇక మరో హీరోగా డైలాగ్ కింగ్ సాయికుమార్ నటిస్తున్నాడు. గతంలో బాలయ్య సినిమాల్లో సాయికుమార్ విలన్‌గా కూడా కనిపించాడు. ఏదేమైనా కాస్టింగ్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేస్తోన్న అనిల్ రావిపూడి సినిమాను ఏ రేంజ్‌కు తీసుకు వెళతాడో ? చూడాలి.