టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన భామలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పటకీ గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు. 1990వ దశకంలో రంభ, రోజా, రమ్యకృష్ణ, ఆమని, ఇంద్రజ, మాలాశ్రీ, నగ్మా, టబు ఇలా ఎంతో మంది హీరోయిన్లు వచ్చి స్టార్లుగా ఓ వెలుగు వెలిగారు. వీరిలో కొందరు సెకండ్ ఇన్సింగ్స్‌లో కూడా రీ ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అత్త, అమ్మ క్యారెక్టర్లతో ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్లు బాగా పాపులర్ అవుతున్నారు.
1990వ దశకంలోనే ఒక్కసారిగా ఉవ్వెత్తున దూసుకు వచ్చింది మన విజయవాడకు చెందిన తెలుగమ్మాయి అయిన విజయలక్ష్మి. సినిమాల్లోకి వచ్చాక తన పేరు రంభగా మారింది. రంభ అంటే అప్పట్లో నిజంగా రంభంత అందంతో ఉండేది. రంభ చలాకీతనం, హాట్‌నెస్… కళ్ల కవ్వింత కుర్రకారును బాగా ఎట్రాక్ట్ చేసేశాయి. ముందుగా టాలీవుడ్‌లో వరుస పెట్టి స్టార్ హీరోలు అందరితోనూ నటించిన రంభ ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.
ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె అక్కడ నుంచి భోజ్‌పురి సినిమాల్లోకి వెళ్లింది. భోజ్‌పురి ప్రేక్షకులు అయితే ఆమెను ఓ ఆరాధ్య దేవతలా నెత్తిన పెట్టేసుకున్నారు. తమిళనాడులో ఒకానొక టైంలో ఖుష్బూను ఫ్యాన్స్ ఆరాధించి ఏకంగా గుళ్లు ఎలా కట్టేశారో ? అంతే స్థాయిలో రంభను భోజ్‌పురి ప్రేక్షకులు ఆరాధించారు. అయితే రంభను ఇద్దరు హీరోలు వన్‌సైడ్ లవ్ చేశారన్న ప్రచారం అప్పట్లో ఉండేది.
టాలీవుడ్‌లో జేడీ చక్రవర్తి రంభను బాగా ఇష్టపడేవారని టాక్ ? అలాగే జేడీకి మహేశ్వరికి మధ్య కూడా ఏదో ఉందన్న గుసగుసలు వినిపించేవి. రంభ – జేడీ చక్రవర్తి మధ్య బొంబాయి ప్రియుడు సినిమా టైంలో మంచి సాన్నిహిత్యం కుదిరింది. జేడీయే కావాలని రంభను పదే పదే ఇబ్బంది పెట్టడంతో పాటు సెట్లో ఆమెను టార్చర్ పెట్టి ఏడిపించేవాడట. జేడీ తీరుతో రంభ ఏడ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమే రాఘవేంద్రరావు స్వరాభిషేకంలో చెప్పింది.
ఆ కీచులాటలు.. సరదా గొడవల టైంలో జేడీయే రంభను ప్రేమించాడని అంటారు. ఇక రంభ భోజ్‌పురి సినిమాల్లోకి వెళ్లినప్పుడు అప్పట్లో భోజ్‌పురిలో స్టార్ హీరోగా ఉన్న బిహార్‌కు చెందిన మనోజ్ తివారి ( ఇప్పుడు ఢిల్లీ బీజేపీ ఎంపీ) సైతం రంభ మాయలో పడిపోయాడని అంటారు. ఇక పెళ్లి తర్వాత రంభ సినిమాలకు పూర్తిగా దూరమైంది. కెనడాకు చెందిన పారిశ్రామికవేత్త ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఆమె ఇప్పుడు ముగ్గురు పిల్లలకు తల్లి కూడా అయ్యింది.
రంభ – ఇంద్రకుమార్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. రంభ చివరిసారిగా 2008లో దొంగ సచ్చినోళ్లు అనే సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇప్పుడు తెలుగు తెరపై ఆమెను రీ ఎంట్రీ చేయించేందుకు స్టార్ డైరెక్టర్లు ట్రై చేస్తున్నారు.