నేచురల్ స్టార్ నాని టైం బాగోలేదా అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ లు పడ్డ నానికి..శ్యామ్ సింగరాయ్ కొంతమేర ఉపశమనం ఇచ్చింది. అయితే..దాని “అంటే సుందరానికి” సినిమా కంటిన్యూ చేస్తుందిలే అనుకుంటే బ్రేక్ లు వేసేసింది. టాలెంటేడ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ఫ్యామిలీ లవ్ డ్రామా ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికీ’ . ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.
వరుసగా ఆడపిల్లలే ఉన్న ఇంట్లో లేక లేక పుట్టిన వంశోధారకుడు..సుందర ప్రసాద్ ని..అతి జాగ్రత్తలతో ఎలా తన సంతోషాని లాకున్నారు అనేదాని డైరెక్టర్ కామెడీ రూపంలో తెరకెక్కించారు. ఇంటర్ క్యాస్ట్ అబ్బాయి..అమ్మాయి ప్రేమించుకుంటే..ఇళ్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చాలా చక్కగా వివరించారు. స్క్రీన్ ప్లే బాగుంది. కానీ, సినిమా చాలా సాగదీశారు అన్న పేరు వచ్చింది. అంతేకాదు..సినిమా కి మిక్స్డ్ టాక్ వచ్చింది.
కొందరు సినిమా హిట్ అంటే మరికొందరు దొబ్బేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా చెప్పుకోతగ్గినవి గా లేవు. అయితే. ఈ సినిమాలో ఫస్ట్ టైండైరెక్ట్ తెలుగు మూవీతో మనముందుకు వచ్చింది మాలయాళ బ్యూటీ నజ్రియా నజీం . ఈ సినిమాలో ఆమె లీల రోల్ లో బాగా సెట్ అయ్యింది. ఈ సినిమాలో నదియా, హర్ష వర్ధన్, రోషిని కీలక పాత్రలు పోషించారు. కాగా, లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నజ్రియాకు రెండు కోట్ల రూపాయలు పే చేసారట. మలయాళంలో ఆమె కు మంచి ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది.
అందుకే నజ్రియా కు ఇంత భారీ మొత్తంలో చెల్లించారట. ఇలా డెబ్యూ సినిమాకి 2 కోట్లు తీసుకున్న ఏకైక హీరోయిన్ నజ్రీయానేనట. ఆమె కెరీర్ లో ఇది అది పెద్ద రెమ్యునరేషన్ క్రింద చెప్తున్నారు. ఇక నిర్మాతలు అంత పే చెయ్యటానికి కారణం…నజ్రియా నటన అయితే, మరోకటి ఆమె భర్త ఫాహద్ ఫాసిల్ అని తెలుస్తుంది.