Moviesఒక్కే ఒక్క రీజన్ తో..ఆ మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్...

ఒక్కే ఒక్క రీజన్ తో..ఆ మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేసిన చైతన్య..?

అక్కినేని నాగ చైతన్య .. సినీ ఇండస్ట్రీలోకి నాన్న నాగార్జున, తాత నాగేశ్వర రావు పేరు చెప్పుకుని వచ్చాడు. ఫస్ట్ సినిమా తోనే డిజాస్టర్ కొట్టిన చైతన్య సెకండ్ సినిమా నుండి ఫాంలోకి వచ్చాడు. తనదైన స్టైల్ లో కధలను చూస్ చేసుకుంటూ..సినిమా సినిమాకి వేరియేషన్స్ చూయిస్తూ కధలో కొత్త దనాని వెత్తుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోల లిస్ట్ లో ఉన్నాడు.

నాగచైతన్య కెరీర్ లో హిట్లకంటే ఫ్లాప్ సినిమాలే ఎక్కువ. అయితే కెరీర్ మొదట్లో చైతన్య తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేశాడు. దాని కారణంగానే ఆయన మంచి మంచి సినిమాలు రిజెక్ట్ చేసిన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. అలా నాగచైతన్య మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను చేతులారా సిల్లీ రీజన్స్ తో వదిలేసుకున్నాడట. అలా నాగచైతన్య వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఏమో ఇప్పుడు చూద్దాం.’

భలే భలే మగాడివోయ్:

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన వన్ ఆఫ్ ది బ్లాక్ బస్తర్ మూవీ . నిజానికి ఈ సినిమా కధ మొదట నాగ చైతన్య దగ్గరకు వెళ్లిందట . కానీ చైతన్య మతిమరుపు ఉన్న అబ్బాయిగా అంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనుకోని భలే భలే మగాడివోయ్ రిజెక్ట్ చేసారట. సీన్ కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్.

కొత్త బంగారులోకం:

వరుణ్ సందేశ్ హీరో గా నటించిన ఈ సినిమా ఎన్ని రికార్డులు తిరగ రాసిందో మనకు తెలిసిందే. వరుణ్ కెరీర్ లో హ్యాపీ డేస్ కన్నా సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ఇదే. ఈ సినిమా కధ ఫస్ట్ చైతన్య కు చెప్పితే..కాలేజీ కుర్రాడి గెటప్ లో ఆయన సెట్ అవ్వరని చెప్పి రిజెక్ట్ చేశారట. అలా ఈ సినిమాను మిస్ చేసుకున్నాడు చైతన్య.

అఆ:
నితిన్-సమంత నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్..సమంత అల్లరి..నితిన్ బాధ్యత..మూడు సినిమాను మరో స్దాయిలో నిలబెట్టాయి. అయితే, ఈ సినిమా మొదట నాగచైతన్య వద్దకే వచ్చింది. అయితే, అప్పట్లో వేరే సినిమాతో బిజీ గా ఉన్న చైతన్య..కాల్ షీట్ అడ్జెస్ట్ చేయలేక ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దాంతో ఈ సినిమా నితిన్ కు వెళ్ళింది. అలా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను వదుకునేశాడు చైతన్య. ఈ మూడు సినిమా చేసుంటే చై కెరీర్ మరో లా ఉండేది. పాపం టైం బ్యాడ్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news