మోడల్ .. మాజీ మిస్ ఇండియా.. ఒకప్పటి బాలీవుడ్ నటి మహిమా చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తెలుగులో కూడా జగపతిబాబు, శ్రీకాంత్ పక్కన మనసులో మాట అనే సినిమా చేసింది. అందానికి అందంతో పాటు కావాల్సినంత టాలెంట్ కూడా మహిమ సొంతం. ప్రముఖ టెన్నీస్ ఆటగాడు లియాండర్ పేస్‌తో మహిమ లాంగ్ టైం పాటు ప్రేమాయణం నడిపింది. చాలా రోజుల పాటు అతడితో ప్రేమలో ఉండడంతో పాటు పెళ్లి చేసుకుంటాడనే అందరూ అనుకున్నారు.
తర్వాత వీరికి బ్రేకప్ అయ్యింది. లియాండర్ పేస్ తనను ఎంతో నమ్మించి మోసం చేశాడంటూ మహిళ బరస్ట్ అయ్యింది. మరో అమ్మాయితో కులుకుతూ తనను వదిలించుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కారణం ఏదైనా కూడా ఇది ఆమె వ్యక్తిగత, సినీ జీవితంపై పడింది. ఓ వెలుగు వెలగాల్సిన ఆమె త్వరగానే ఫేడవుట్ అయ్యింది. ఆ తర్వాత 2006లో ఆర్కిటెక్ట్ కం బిజినెస్‌మేన్ బాబీ ముఖర్జీని వివాహం చేసుకుని అరియానా అనే అమ్మాయికి జన్మనిచ్చింది.
బ్యాడ్ లక్ ఏంటంటే బాబీ ముఖర్జీతో కూడా మనస్పర్తలు రావడంతో అతడికి పెళ్లయిన ఐదేళ్లకే అంటే 2011లోనే విడాకులు ఇచ్చేసింది. లియాండర్ ఫేస్‌తో ఎఫైర్ ఫెయిల్ అయ్యాక అతడు మంచి ఆటగాడే అయినా నాతో ఫెయిర్ గేమ్ ఆడలేదు. మరో అమ్మాయి ( మోడల్ రియా)తో షికార్లు చేస్తున్నాడని.. తనను మోసం చేస్తున్నాని తెలిసినప్పుడు తాను ఎంతో బాధపడ్డానని వాపోయింది.
ఫేస్ రియా పెళ్లైతో కూడా అదే పని చేశాడని తనకు తెలిసిందని చెప్పింది. మహిమాను కాదని రియా పిళ్లైను పెళ్లి చేసుకున్న లియాండర్ పేస్ ఆమెకు కూడా దూరమైన ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ కిమ్శర్మతో డేటింగ్లో ఉన్నాడు. లియాండర్ పేస్‌తో ప్రేమలో ఉన్న టైంలో మహిమ కెరీర్ టాప్ గేర్‌లో ఉండేది. ఆ తర్వాత ఆమెకు ఇండస్ట్రీతోనూ సంబంధాలు దెబ్బతిన్నాయి.
తనకు లైఫ్ ఇచ్చిన బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత సుభాష్ ఘాయ్తోనూ ఆమెకు గొడవలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెకు ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు. ఇటు వ్యక్తిగత, వైవాహిక జీవితం కూడా ఫెయిల్ అయ్యింది. అయితే ఇప్పుడు తన టీనేజ్ కూతురు అరియానాతో మాత్రం ఫొటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది.