కథ, కథనాలతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు కేవలం ఆయా హీరోల నటనతో హిట్ అవుతూ ఉంటాయి. ఆ క్యారెక్టర్‌కు తమ నటనతో ప్రాణం పోస్తూ సదరు హీరోలు ఒంటిచేత్తో వాటిని హిట్ చేస్తూ ఉంటారు. నటనతో సినిమాను ఒంటిచేత్తో ముందుకు నడిపించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ చివరి ఆరేడు సినిమాలు చూస్తే నటన విషయంలో ఎంతలా ఎఫర్ట్ పెడుతున్నాడో తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఆరు వరుస హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి.. ఈ తరం జనరేషన్ హీరోల్లో ఎవ్వరికి సాధ్యం కాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ – జై లవకుశ – అరవింద సమేత వీరరాఘవ.. తాజాగా త్రిబుల్ ఆర్‌తో ఎన్టీఆర్ ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ హిట్లు పడ్డాయి. త్రిబుల్ ఆర్ సినిమాలో కూడా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు.
ఎన్టీఆర్‌కు ప్రయార్టీ తగ్గిందన్న చర్చలు నడిచినా.. ఎన్టీఆర్ నటనతో తన డామినేషన్ చూపించేసుకున్నాడు. ఈ విషయంపై తెలుగు నుంచి మాత్రమే కాదు పాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్‌కు ప్రశంసలు దక్కాయి. టెంపర్ సినిమా మామూలు స్టోరీయే. అందులో ఎన్టీఆర్ అమోఘమైన నటనే సినిమాను మరో రేంజ్‌కు తీసుకుపోయింది. అసలు క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ తన నటనతో గుండెలను పిండేశాడు.
ఇక నాన్నకు ప్రేమతో నిజంగానే క్లాస్ స్టోరీ. అసలు అందులో ఎన్టీఆర్ సెట్ అవుతాడా ? అన్న సందేహాలే అందరికి ఉండేవి. అలాంటిది ఎన్టీఆర్ తన క్లాసిక్ నటనతో క్లాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అసలు ఎన్టీఆర్ అనేవాడు లేకపోతే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. ఇక జనతా గ్యారేజ్ సినిమా కూడా కొరటాల శివ మిర్చి, శ్రీమంతుడు రేంజ్ కథ కాదు. ఓ సాదాసీదా మామూలు కథలో ఎన్టీఆర్ సెంటిమెంటల్ నటనతో ప్రేక్షకులకు సినిమాను బాగా కనెక్ట్ చేయడంతో సినిమా హిట్ కొట్టేసింది.
ఇక జై లవకుశ సినిమా విషయానికి వస్తే దర్శకుడిగా బాబి మెరుపులేం లేవు. ఎన్టీఆర్ మూడు పాత్రల్లోనూ అదరగొట్టేశాడు. ముఖ్యంగా రావన్ పాత్రల్లో నత్తిగా చేసిన నటన మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. ఈ మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఒక్కడు మాత్రమే ఈ వేరియేషన్ చూపిస్తాడు. మరే హీరో చేసినా ఈ సినిమా యావరేజ్ కన్నా ఘోరంగా ఉండేది. కేవలం ఎన్టీఆర్ మూడు పాత్రలను తన భుజాల మీద నడిపిస్తూ సినిమాను హిట్ చేశాడు.
ఇక అరవింద సమేతకు త్రివిక్రమ్ రచయితగా ఫెయిల్ అయినట్టే. అల వైకుంఠపురంలో, సన్నాఫ్, అత్తారింటికి దారేది రేంజ్ కథ, కథనం కానే కాదు. ఎన్టీఆర్ ఎమోషనల్ యాక్టింగ్‌తోనే సినిమాను హిట్ చేశాడు. ఇలా వీక్ కథలు తనకు వరుసగా వస్తున్నా… స్క్రీన్ ప్లే మ్యాజిక్ లేకపోయినా తన నటనతోనే ఎన్టీఆర్ ఒంటి చేత్తో సినిమాను ఒడ్డున పడేస్తున్నాడు. ఇదంతా ఎన్టీఆర్ నటనా ఛరిష్మాయే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.