హీరో గోపీచంద్..ఈయన గురించి పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ సినిమాతోనే అందరి కళ్లు తన వైపు పడేలా చేసుకున్నాడు. తొలి వలపు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన గోపీచంద్..ఆ తరువాత తన్ అరూట్ మార్చుకుని విజయ వంతమైన చిత్రాలలో విలన్గా ప్రేక్షకులకు అమితంగా ఆకట్టుకున్నారు. ఆ టైంలో హీరోలు సీతం ఆయనని చూసి అసూయ పడేలా బాడీ బిల్డ్ చేశాడు. ఆ రోజుల్లో గోపీచంద్ షర్ట్ లేకుండా తెర పై కనిపిస్తే..ధియేత్రస్ విజిల్స్ తో దద్దరిల్లిపోయేదు. అట్లుంటాది గోపీచంద సినిమా అంటే. జయం, నిజం, వర్షం వంటి చిత్రాలలో విలన్గా ఆయన నటించిన తీరు ఇప్పటికి జనల చేత శభాస్ అనిపిస్తుంది.
అయితే, మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ..కెరీర్ బాగా ముందుకు సాగుతున్న టైంలోనే గోపిచంద్..విలన్ గా ఆపేసి.. ఆ తర్వాత మళ్లీ హీరోగా నటించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన 2004 నుంచి 2010 వరకు ఎన్నో యాక్షన్ సినిమాలు చేశారు. కానీ ఒక్కటి అంటే ఒక్కటి సినిమా కూడా హిట్ అవ్వలేదు. హిట్ పక్కన పెడితే కనీసం పాజీటివ్ టాక్ ను కూడా సొంతం చేసుకోలేక పోయాయి ఆయన సినిమాలు. దీంతో ఆయన కెరీర్ కి ఫుల్ స్టార్ పెట్టేయచ్చు అంటూ టాక్ వినిపిస్తున్న క్రమంలో ఎలాగోలా “సీటిమార్” సినిమాతో సూపర్ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన నటిస్తున్న “పక్కా కమర్షీయల్ ” హిట్ అయితే..మళ్ళీ గోపీచంద్ ఫాంలోకి వచ్చిన్నట్లే.
కానీ, ఈ సినిమా విషయంలో నిర్మాతలతో కొంచెం చెడ్డిన్నట్లుంది ఆయనకి. సినిమా టైంలో తనకు ఇస్తానన్న రెమ్యూనరేషన్ ఇంకా బాకీ ఉండటంతో సినిమా షూటింగ్ కి రావడం లేదట గోపీచంద్. సినిమా అంతా పూర్తి అయ్యిందని, కేవలం ఒక్క పాట మాత్రమే ఉందని..కానీ నిర్మాతలు ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంచారట. దీంతో తన రెమ్యునరేషన్ తనకి పూర్తిగా ఇచ్చే వరకు గోపీచంద్ షూటింగ్ కి రావడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. మరి చూడాలి నిర్మాతలు గోపీచంద్ కి ఎలా సర్ధి చెప్పుతారో.. ఎవరు కాంప్రమైజ్ అయ్యి.. సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తారో ..వేచి చూడాలి.!!