లోకనాయకుడు, సీనియర్ హీరో కమల్‌హాసన్ గారాల పట్టి అయిన శృతీహాసన్ ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు దాటేసింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.. మంచి హిట్లు కొట్టింది. మిగిలిన భాషల కంటే తెలుగు ఇండస్ట్రీయే ఆమెను నెత్తిన పెట్టుకుంది. ఇక్కడ మాంచి ఫామ్‌లో ఉండగానే బాలీవుడ్‌లో రాణించాలని ఆత్యాశతో అక్కడకు వెళ్లడం.. దీనికి తోడు ప్రేమాయణాలు ఆమె కెరీర్ తల్లకిందులు అవ్వడానికి కారణమయ్యాయి.
ఆ తర్వాత తప్పు తెలుసుకుని ఆమె తెలుగులో మళ్లీ సినిమాలు చేసినా మారిపోయిన ఫిజిక్, ఫేడవుట్ అవ్వడంతో ఆమె సెకండ్ ఇన్సింగ్స్ అనుకున్నంత సజావుగా సాగలేదు. సెకండ్ ఇన్సింగ్స్‌లో పవన్ కాటమరాయుడు, వకీల్‌సాబ్ సినిమాల కంటే క్రాక్ సినిమాయే ఆమెకు హిట్ అయ్యి మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు బాలయ్యతో పాటు చిరంజీవి లాంటి సీనియర్ హీరోల పక్కన సినిమాలు చేస్తోంది.
అయితే శృతీ తన ప్రేమకథలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే వచ్చింది. ఇప్పటికే సిద్ధార్థ్ లాంటి హీరోల మొదలుకుని విదేశీ భాయ్ ఫ్రెండ్ వరకు పలువురితో ఎఫైర్లతో ఆమె వార్తల్లో ఉంటూనే వచ్చింది. ప్రస్తుతం కూడా ఆమె ఓ ప్రేమకథ నడిపిస్తోంది. అయితే పెళ్లి ఆలోచన ఉందా ? అంటే ఆమె అందుకు సుముఖంగా లేదనే తెలుస్తోంది. కారణం ఆమె స్పష్టంగా చెప్పకపోయినా శృతి తల్లిదండ్రులు తమ వైవాహిక బంధాన్ని తెంచేసుకున్నారు.
ఆ కారణంతోనే మీరు పెళ్లి చేసుకోవడం లేదా ? అని ప్రశ్నిస్తే ఆమె కొట్టి పడేసింది. కమల్ – సారికలు ముందు పెళ్లి కంటే సహజీవనం చేసి తల్లిదండ్రులు అయ్యారు. పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయారు. అసలు ఇప్పుడు శృతి తల్లి సారిక ఇంత మంది ఉండి కూడా దయనీయ జీవితం గడుపుతోంది. తమ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నా కూడా వారు ఉన్నంతసేపు చాలా హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేశారని శృతి చెపుతోంది.
తాను పెళ్లిపై నర్వస్ కావడానికి తల్లిదండ్రుల విడాకులు కారణం కాదని చెపుతున్నా… పెళ్లి చేసుకుని ఓ బంధంలో చిక్కుకుపోయేందుకు మాత్రం ఆమె ఇష్టపడడం లేదని ఓపెన్‌గానే అర్థమవుతోంది. చేస్తే ప్రేమించడం.. లేకపోతే ఏదో ఒక భాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేయడం.. ప్రస్తుతం ఎలాగూ ఆఫర్లు వస్తున్నాయి.. కాబట్టి పెళ్లి అనే బంధానికి దూరంగా మరికొద్ది రోజులు ఇట్లా కంటిన్యూ అయిపోవడం అనే కాన్సెఫ్ట్‌లో శృతి ఉన్నట్టు అర్థమవుతోంది.