మెగా ఫ్యాన్స్ మధ్య వార్ మరింత ముదురుతోన్న వాతావరణమే ఉంది. గత నాలుగైదేళ్లుగా బన్నీ – మెగాభిమానుల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. బన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ మెగా బ్రాండ్‌కు దూరం జరిగే ప్రయత్నాలే చేస్తు వస్తున్నాడు. అందుకే సపరేట్‌గా ఏఏ పేరుతో అల్లు అర్జున్ ఆర్మీ అంటూ ఓ సైన్యం క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. అప్పట్లోనే గోదావరి జిల్లాల్లో అల్లు ఆర్మీ పేరిట సభలు, సమావేశాలు కూడా పెట్టుకున్నారు.
అప్పట్లోనే ఇది మెగాభిమానుల మధ్య చీలిక వచ్చిందా ? అన్న సందేహాలకు కారణమైంది. బన్నీ రేంజ్ వేరు.. ఓ స్ట్రాటజీతోనే ముందుకు వెళుతున్నాడు. అందరు హీరోలు, దర్శకులతో సఖ్యతతో ఉంటూ… అందరకు దగ్గరవుతున్నాడు. బన్నీకి సోషల్ మీడియాలో రోజు రోజుకు పెరుగుతోన్న ఆదరణ.. అన్నీ కాంపౌండ్‌లలోనూ బన్నీకి అభిమానులు ఉంటున్నారు.
అన్‌స్టాపబుల్ షోకు బాలయ్యను చాయిస్‌గా తీసుకుని నందమూరి, అటు బాలయ్య అభిమానులకు దగ్గరయ్యాడు. ఇటు ఎన్టీఆర్‌తోనూ సఖ్యతతో ఉంటూ బావా అని పిలుచునేంత చనువు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు మెగాభిమానుల మీటింగ్‌లు పెడుతూ అందులో బన్నీ ఫొటోలు లేకుండా చేయడంతో అవన్నీ వికటిస్తున్నాయి. చిరు, పవన్, చరణ్, నాగబాబు మాత్రమే మెగా హీరోలు అని.. బన్నీ మెగా హీరో కాదంటూ వాళ్ల సైడ్ చేస్తుండడం బన్నీ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది.
దీంతో సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నెట్టింట్లో ఏమీ పీకలేరు బ్రదర్ అంటూ హ్యాష్ ట్యాగ్‌ను లక్షల్లో ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ మెగా మీట్‌లో ఓ అభిమాని మాట్లాడుతూ బన్నీ ఈ స్థాయికి రావడానికి కారణం చిరంజీవే అని.. అయితే బన్నీ ఆ కృతజ్ఞత మర్చిపోయాడని.. మెగాభిమానులు ఎవ్వరూ బన్నీకి పల్లకీ మోయాల్సిన అవసరం లేదని అనడంతో అది బయటకు వచ్చేసింది.
దీంతో బన్నీ ఫ్యాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. తాము ఎక్కడా వెనక్కు తగ్గమని దెబ్బకు దెబ్బ కొడతామని సవాళ్లు రువ్వుతున్నారు. మెగాభిమానులను ఉద్దేశించి ఏం పీకలేరు బ్రదర్ అంటూ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. అంతే కాకుండా బన్నీని ఉద్దేశించి మాట్లాడిన సదరు వ్యక్తి మరణించినట్టుగా ఫొటోలు వేసి మరీ వైరల్ చేస్తున్నారు. అసలే ఆచార్య సినిమా ప్లాప్… వచ్చే సినిమాల టైంకు అయినా మెగాభిమానులను ఏకంగా చేయాలని అనుకున్న కొందరు మెగాభిమానుల ప్లాన్లు వికటించాయి.