టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్‌లో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. త్రిబుల్ ఆర్ సక్సెస్ మోడ్‌లో ఉన్న ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. 31వ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో కొరటాల సినిమాను యువసుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ సినిమాను మైత్రీ వాళ్లతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోంది.
ఈ రెండు సినిమాలు కూడా ఎన్టీఆర్ రేంజ్‌కు తగినట్టుగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లుగా తెరకెక్కనున్నాయి. అయితే ఎన్టీఆర్ 31 సెట్స్ మీదకు వచ్చేందుకు ఇంకా టైం ఉంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2023, ఏప్రిల్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ లోగా ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో చేసే సలార్ షూటింగ్ పూర్తి చేస్తాడు.
ఇక ఎన్టీఆర్ కొరటాల సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను కొరటాల పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు. ఆచార్య తర్వాత కొరటాల కసితో ఈ సినిమాకు పని చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ కూడా పాన్ ఇండియా లెవల్లో ఉండేందుకు పలువురు టాప్ హీరోయిన్ల పేర్లు పరిశీలించారు. కైరా అద్వానీ, జాన్వీ కపూర్ పేర్లు బయటకు వచ్చాయి.
అయితే తాజా అప్డేట్ ప్రకారం లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన దిశా పటానిని కొరటాల టీం ఎంపిక చేసినట్టు తెలిసింది. హిందీలో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్న దిశ ఎప్పుడూ కూడా హాట్ బికినీ షోలతో సందడి చేస్తూ ఉంటుంది. ఆమె సినిమాల కంటే ఎక్కువుగా హాట్ ఫొటోస్తోనే వార్తల్లో ఉంటూ ఉంటుంది.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ 30 ప్రాజెక్టులో ఆమె హీరోయిన్గా వస్తే ఆమె కెరీర్ తిరిగిపోయినట్టే అవుతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో దిశ కొంత కాలం వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. దిశ తెలుగులో ప్రభాస్ ప్రాజెక్ట్ K లో కీలక పాత్రలో నటిస్తోంది.