Moviesపూజా హెగ్డే ఈ వైట్ డ్రెస్ వెన‌క ఇంత క‌థ ఉందా......

పూజా హెగ్డే ఈ వైట్ డ్రెస్ వెన‌క ఇంత క‌థ ఉందా… రేటు ఎంతో తెలుసా…!

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఏ టాప్ హీరో సినిమాలో చూసినా పూజానే హీరోయిన్‌. స్టార్ డైరెక్ట‌ర్లు, హీరోలు ఆమెతో సినిమా చేసేందుకు వెంట ప‌డుతున్నారు. అంతెందుకు ఆమె న‌టించిన చివ‌రి మూడు సినిమాలు రాధేశ్యామ్‌, బీస్ట్‌, ఆచార్య ప్లాప్ అయినా కూడా పూజ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. సౌత్ టు నార్త్ పూజ వ‌రుస పెట్టి సినిమాలు చేస్తుండ‌డంతో పాటు ఒక్కో సినిమాకు రు. 3 కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తోన్న ప‌రిస్థితి ఉంది.

ఇక పూజ తాజాగా తెలుగులో మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ సినిమాలో కూడా హీరోయిన్‌గా ఎంపికైంది. ప్ర‌స్తుతం ఆమె కాన్స్ చిత్రోత్సవంలో అదరగొడుతోంది. రెడ్ కార్పెట్ పై హొయలు ఒలికిస్తోన్న ఆమె స్టిల్స్ ఆమె అభిమానులు, కుర్ర‌కారుకు నిద్ర‌లేకుండా చేస్తున్నాయి. సాగ‌ర తీరంలో ఆమె వైట్ డ్రెస్ వేసుకుని చేసిన ఫొటో షూట్ అయితే ఇప్పుడు అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది.

ఈ వైట్ క‌ల‌ర్ డ్రెస్సు గురించే ఇప్పుడు ఎక్క‌డ ఊసినా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. పూజా వేసుకున్న ఈ డ్రెస్ ఖ‌రీదు అక్ష‌రాలా రు. 15 వేలు అట‌. చూడ‌డానికి ఈ డ్రెస్ చాలా సింపుల్‌గా ఉన్నా కూడా దీని వెన‌క పెద్ద క‌థే ఉంద‌ట‌. ఆస్ట్రేలియాకు చెందిన డిజైన‌ర్ టోనీ మేటిసెవ్ స్కీ.. ఈ డ్రెస్ డిజైన్ చేశాడు. ఈ డ్రెస్ వేలాడిన‌ట్టు క‌నిపించ‌ద‌ట‌.

ఈ డ్రెస్ ఓ వైపు బాడీకి అతుక్కుపోయిన‌ట్టు ఉంటూనే.. మ‌రోవైపు ఎద‌, మెడ భాగాల్లో చాలా ప‌ర్‌ఫెక్ట్ డిజైనింగ్‌లో ఉంటుంద‌ట‌. అందుకే దీనికి ఇంత రేటు పెట్టాడ‌ని అంటున్నారు. ఈ డ్రెస్‌లో మ‌రో స్పెషాలిటీ కూడా ఉంది. జ్యూవెల‌రీ ఖ‌ర్చు ఉండ‌ద‌ట‌. సింపుల్‌గా ఇయ‌ర్ రింగ్స్ పెట్టుకుంటే చాల‌ని అంటున్నాడు. ఈ తెల్ల‌టి దుస్తుల‌తోనే సాగ‌ర‌తీరంలో మెరిసింది పూజా హెగ్డే.

ఇక ఇప్పటికే కోలీవుడ్‌, టాలీవుడ్ టు సౌత్‌ను దున్నేస్తోన్న ఈ అమ్మ‌డు త్వ‌ర‌లోనే బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి న‌టించ‌నుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్లు కూడా త్వ‌ర‌లోనే మెద‌లు పెట్ట‌బోతోంది.

Latest news