Moviesఎన్టీఆర్ - ప్ర‌ణ‌తి దంప‌తుల తీర‌ని కోరిక ఇదే... !

ఎన్టీఆర్ – ప్ర‌ణ‌తి దంప‌తుల తీర‌ని కోరిక ఇదే… !

యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఓ వైపు సినిమాల‌కు ప్ర‌యార్టీ ఇస్తూనే అటు కుటుంబానికి కూడా ప్రాధాన్య‌త ఇస్తూ ఉంటాడు. సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఫ్యామిలీతో విదేశీ ట్రిప్‌ల‌కు చెక్కేస్తూ ఉంటాడు. విదేశాల‌కు వెకేష‌న్ల‌కు వెళుతూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటాడు. త్రిబుల్ ఆర్ స‌క్సెస్ త‌ర్వాత కొర‌టాల శివ సినిమాకు మ‌ధ్య‌లో గ్యాప్ రావ‌డంతో ఫ్యామిలీ వెకేష‌న్‌కు చెక్కేశాడు. ఎన్టీఆర్ సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద హంగామాకు పోడు. ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి కూడా బ‌య‌ట కాని.. సోష‌ల్ మీడియాలో కాని హ‌డావుడి చేయ‌రు. అస‌లు ఆమె చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.

2011లో ఎన్టీఆర్ – ల‌క్ష్మి ప్ర‌ణ‌తి దంప‌తుల వివాహం జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అభ‌య్ రామ్‌, రెండో కుమారుడు భార్గ‌వ్ రామ్‌. త‌న ఇద్ద‌రు కుమారుల పేర్లు చివ‌ర త‌న తాత రామారావు పేరు క‌లిసి వ‌చ్చేలా రామ్ అని పెట్టుకున్నాడు. ఎన్టీఆర్ భార్య రెండోసారి గ‌ర్భ‌వ‌తి అయిన‌ప్పుడు త‌న‌కు కూతురు పుడితే బాగుంటుంద‌ని ఎన్టీఆర్‌, ప్ర‌ణ‌తి ఇద్ద‌రూ కోరుకున్నార‌ట‌.

 

ఎన్టీఆర్‌కు మ‌హిళ‌లు అంటే ఎంతో గౌర‌వం.. త‌న సినిమాల్లో మ‌హిళా న‌టుల‌ను ఎంతో గౌర‌వించ‌డంతో పాటు వారితో ఎంతో అప్యాయ‌త‌తో ఉంటాడు. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించిన ఎంతో మంది మ‌హిళా న‌టులు స్వ‌యంగా చెప్పారు. ఈ క్ర‌మంలోనే భార్య ప్ర‌ణ‌తి రెండోసారి గ‌ర్భ‌వ‌తి అయిన‌ప్పుడు కూతురు పుడితే మంచి పేరు పెట్టాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

అయితే రెండోసారి కూడా అందంతో భార్గ‌వ్ రామ్ పుట్టాడు. నంద‌మూరి ఫ్యామిలీకి త‌న కుమార్తె ఆడ‌ప‌డుచుగా ఉంటుంద‌ని ఎన్టీఆర్ ఆశ‌ప‌డ్డాడు. ఎన్టీఆర్ ఒక్క‌డే సంతానం. అత‌డికి తోబుట్టువులు ఎవ్వ‌రూ లేరు. అయితే హ‌రికృష్ణ మొద‌టి భార్య పిల్ల‌లు అయిన దివంగ‌త జాన‌కీరామ్‌, క‌ళ్యాణ్‌రామ్‌తో పాటు సోద‌రి సుహాసినితో సొంత సోద‌రుడు బంధాన్నే తార‌క్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news