ఎస్ ఇది నిజంగా ఆశ్చర్యకరంగానే అనిపిస్తోంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు రాజకీయాల సంగతి ఎలా ఉన్నా సినిమాల పరంగా తిరుగులేని క్రేజ్ ఉంది. మొన్న భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో బెనిఫిట్ షోలు లేకపోతే ఆంధ్రాలో పవన్ అభిమానులు అందరూ సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ థియేటర్లకు పోటెత్తారు. ఖమ్మం, పాల్వంచ, అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర, కోదాడ, అటు గద్వాల్, ఆలంపూర్.. చివరకు కొందరు అయితే హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
అది పవన్ క్రేజ్.. పవన్ రేంజ్. రు. 70 కోట్లు ఖర్చు పెట్టి తీస్తే గ్రాస్ పరంగా ఈ సినిమా రు. 200 కోట్లు వసూలు చేసిందని టాక్ ? అయితే ఏపీలో టిక్కెట్ రేట్లు తక్కువుగా ఉండడంతో అనుకున్న వసూళ్లు రాలేదు. పైగా అది రీమేక్ సినిమా… అయినా పవన్ ఛరిష్మాతోనే ఈ రేంజ్లో వసూల్లు వచ్చాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. అప్పటికే ఆ సినిమాను చాలా మంది యూట్యూబుల్లో చూసేయడం.. దీనికి తోడు డైరెక్టర్ సాగర్ చంద్ర రీమేక్‌ను మరి కొత్తగా… సంచలనాలు నమోదు చేసేలా కూడా తీయలేదు.
కారణాలు ఏవైనా సినిమా పవన్ రేంజ్‌కు తగిన హిట్ కానే కాదు. అయితే ఈ సినిమాకు టీవీలో దక్కిన రేటింగ్ జస్ట్ 9.06 మాత్రమే. రాజకీయాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు చూసేవాళ్లు చాలా మందే ఉంటారు. అసలు పవన్ క్రేజ్, ఛరిష్మా అలాంటిది. కానీ భీమ్లానాయక్‌ను మాత్రం ఎందుకో బుల్లితెరపై జనాలు పట్టించుకోలేదు. పైగా సినిమాలో రానా ఉన్నాడు. బలమైన విలనూ ఉన్నాడు.
ఇద్దరు క్రేజీ హీరోయన్లు కూడా ఉన్నారు. పాటలు కూడా బాగానే ఉంటాయి. ఇక త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, కథలో మార్పులు ఉండనే ఉన్నాయి. ఎందుకో గాని బుల్లితెరపై ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇది నిజంగా షాకే.. ! అయితే అంతకు ముందే ఓటీటీల్లో వచ్చేయడం వల్లో లేదా రీమేక్ కావడంతో మళయాళ ఒరిజినల్ ఓ సారి.. భీమ్లానాయక్ మరోసారి చూసినోళ్లు టీవీల్లో ఈ సినిమాను పట్టించుకోలేదని తెలుస్తోంది.
దీనిని మా టీవీలో ప్రసారం చేశారు. దాని రీచ్ చాలా ఎక్కువ. పైగా పెద్ద హీరోల సినిమాలకు అదిరిపోయే రేటింగ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు రెండోసారి వేసినప్పుడు కూడా వచ్చే రేటింగ్ కన్నా తక్కువుగా భీమ్లానాయక్‌కు 9.06 రేటింగ్ మాత్రమే నమోదైంది. పవన్ రేంజ్‌కు కూడా ఇది చాలా చాలా తక్కువ రేటింగే అని చెప్పాలి.