Moviesమ మ మహేశ్ కి తమ్ముడిగా లేటేస్ట్ మాస్ హీరో..ఇక రచ్చ...

మ మ మహేశ్ కి తమ్ముడిగా లేటేస్ట్ మాస్ హీరో..ఇక రచ్చ మామూలుగా ఉండదుగా..?

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి జోష్ మీద ఉన్నాడు. రీసెంట్ గా ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సర్కారు వారి పాట. డైరెక్టర్ పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కిర్తీ సురేష్ హీరోయిన్‏గా నటించింది. గత గురువారం ఈ మూవీ ధియేటర్స్ లో రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేనా బాక్స్ ఆఫిస్ వద్ద రికార్డులతో షేక్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా కి మెయిన్ హైలెట్ గా నిలిచింది కీర్తి-మహేశ్ లవ్ ట్రాక్..అందుకు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన తమన్ మ్యూజిక్ చించేశాడు.

ఇక ఈ మూవీ తర్వాత మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ఖలేజా వంటి విభిన్నమైన సినిమాల తరువాత వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ అల.. వైకుంఠపురములో లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం చేస్తున్న సినిమా కాబట్టి బడ్జెట్ లెక్కలు గట్టిగానే పెరిగాయి. భీంలా నాయక్ కి హెల్ప్ చేసినా..పూర్తి స్దాయి డైరెక్టర్ గా అల.. వైకుంఠపురములో తరువాత తెరకెక్కిస్తున్న మూవీ ఇదే.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో గత కొంత కాలం నుంచి మరో హీరో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. కాగా ఆ విషయం ఆల్ మోస్ట్ ఫైనల్ కి తెచ్చేసిన్నట్లు ఉన్నారు మేకర్స్. ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో మరో హీరోగా లెటేస్ట్ సెన్సేషన్ సిద్ధు జొన్నలగడ్డ పేరు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

DJ TILLU లో ఆయన బాడీ లాంగ్వేజ్ చూశాక ఈ సినిమాలో మహేశ్ బ్రదర్ రోల్ కి బాగా మ్యాచ్ అవుతుందని..అల్లరి చిల్లరిగా ఉండే స్టైల్ కి సిద్ధు కరెక్ట్ గా ఉంటాడని..అందుకే ఈ పాత్రకు ఆయనను ఫిక్స్ చేశారట మేకర్స్. అయితే ఇంకా దీనిపై మాత్రం ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా హారికా హాసిని వారు భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ స్కేల్ లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. మహేశ్ లాంటి క్లాస్ అన్న సినిమాలో సిద్ధు లాంటి మాస్ తమ్ముడు యాడ్ అయితే..బాక్స్ బద్ధలవ్వాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news