అనిల్ రావిపూడి వరుస విజయాల పరంపరలో వచ్చిన సినిమా ఎఫ్ 2. 2019 సంక్రాంతి కానుకగా బాలయ్య చేసిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, రామ్‌చరన్ వినయవిధేయ రామ సినిమాలకు పోటీగా వచ్చింది. ఆ రెండు సినిమాలు ప్లాప్ అయితే ఈ యేడాది సంక్రాంతి విన్నర్ అయిపోయింది ఎఫ్ 2. సేమ్ టు సేమ్ అదే హీరోలు, హీరోయిన్లు… అదే బ్యానర్, డైరెక్టర్… కొత్తగా సునీల్, సోనాల్ చౌహాన్ లాంటి మెరుపులు యాడ్ చేసుకుని ఇప్పుడు ఎఫ్ 3 వస్తోంది. ఎఫ్ 2కు కాస్త అటూ ఇటూగా ఉండే కథే ఎఫ్ 3 అని ట్రైలర్ చెప్పకనే చెప్పేసింది.
అయితే ఎఫ్ 2 సినిమాతో దిల్ రాజుకు భారీ లాభాల పంట పండింది. మామూలు డబ్బులు రాలేదు. సినిమాకు అయిన బడ్జెట్ తక్కువ. సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద సినిమాలు ప్లాప్ కావడంతో తన థియేటర్లను భారీగా కేటాయించుకుని క్యాష్ చేసుకున్నాడు. అయితే ఎఫ్ 3 సినిమాకు వచ్చేసరికి దిల్ రాజుకు రిలీజ్‌కు ముందే వాచిపోయిందని అంటున్నారు. ఎఫ్ 3 సంగతేమోగాని.. రెమ్యునరేషన్లు కూడా ట్రిబుల్ అయిపోయాయంటున్నారు.
ఎఫ్ 3 సినిమాకు వెంకీ రెమ్యునరేషన్ అక్షరాలా రు. 15 కోట్లుగా ముట్టిందట. ఎఫ్ 2 హిట్ అవ్వడంతో వెంకీ కూడా రు. 15 కోట్లు తీసుకున్నాడని అంటున్నారు. వెంకీ స్టార్ హీరో, సీనియర్ హీరో అయినా కూడా ఎప్పుడూ రెమ్యునరేషన్ రు. 10 కోట్లు దాటలేదు. అయితే ఈ సారి మాత్రం రు. 15 కోట్లు తీసుకున్నట్టు టాక్ ? ఇక వరుణ్ తేజ్‌కు ఎఫ్ 2కు రు. 5 కోట్లు కూడా ముట్టినట్టు లేదు. అయితే ఇప్పుడు అదే వరుణ్ రు. 12 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది.
వెంకీ, వరుణ్ ఎంత అడిగితే అంత ఇచ్చేశాడట దిల్ రాజు. ఇక అనిల్ రావిపూడికి కూడా భారీ రెమ్యునరేషనే ముట్టిందంటున్నారు. ఓవరాల్‌గా బడ్జెట్ రు. 45 కోట్లు అంటున్నా.. కరోనా వడ్డీలు కలుపుకుంటే చాలానే అయ్యిందని అంటున్నారు. పైగా ఈ సినిమాకు సునీల్, సోనాల్ లాంటి కొత్త స్టార్లు
యాడ్ అవ్వడంతో పాటు పూజా హెగ్డేతో ఐటెం సాంగ్ కూడా చేయించారు. దీంతో బడ్జెట్ లిమిట్ దాటేసిందని టాక్ ?
దిల్ రాజు బ్యానర్ పేరు చూపించి.. తన మార్కెట్ స్ట్రాటజీతో మంచి రేట్లకే అమ్ముకున్నాడని అంటున్నారు. పైగా మామూలు రేట్లకే తమ సినిమా చూడమని చెప్పేశాడు. మరి రేపు ఎఫ్ 3 ప్రేక్షకులకు ఎలాంటి కిక్ ఇస్తుందో ? రిటర్న్ ఎలా ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికి అయితే రిలీజ్‌కు ముందే రాజుకు వాచిపోయింది.