ఒక పదం కలిసేలా టైటిల్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఒకే టైంలో రిలీజ్ అయితే ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఉదాహరణకు విక్టరీ వెంకటేష్ హీరోగా రాజా అన్న పదం కలిసేలా చాలా సినిమాలు వచ్చాయి. పోకిరీ రాజా – బొబ్బిలి రాజా – రాజా – కొండపల్లి రాజా ఇలా చాలా సినిమాలు చేశారు. అలాగే రౌడీ అన్న పదం కలిసేలా కూడా మన హీరోలు చాలా సినిమాలు చేశారు. అలాగే శివ అన్న పదం కలిసేలా కూడా చాలా సినిమాలు వచ్చాయి. 1990లో ఇద్దరు స్టార్ హీరోలు అయిన విక్టరీ వెంకటేష్ – మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ కూడా రాజా అన్న పదం కలిసి వచ్చేలా రెండు సినిమాలు చేశారు.
ఈ రెండూ కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యయి. విక్టరీ వెంకటేష్ బొబ్బిలి రాజా, చిరంజీవి రాజా విక్రమార్క్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ దగ్గర పై చేయి సాధించింది ? ఎవరు గెలిచారు ? అన్నది చూద్దాం. 1990లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రాజా విక్రమార్క సినిమా వచ్చింది. అప్పట్లో ఫామ్‌లో ఉన్న అమల హీరోయిన్గా చేసింది. రాధిక కూడా కీలక పాత్రలో కనిపించింది.
ఈ సినిమాను హిందీలో సత్యమా నాన్ కావైకారన్గా అనువదించారు. ఇది తమిళ సినిమా మై డియర్ మార్తాండన్కు రీమేక్. ఈ సినిమాను 1988లో వచ్చిన కమింట్ టు అమెరికా ఆధారంగా తెరకెక్కించారు. రాజ్‌కోటి స్వరపర్చిన గీతాలు అప్పట్లో హిట్ అయ్యాయి. అమల తన డ్యాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేసింది.
అదే యేడాది విక్టరీ వెంకటేష్ తన సొంత బ్యానర్లో బొబ్బిలి రాజా సినిమా చేశాడు. బి. గోపాల్ ఈ సినిమాకు దర్శకుడు. దివ్య భారతి హీరోయిన్గా నటించింది. సెప్టెంబర్ 14న నిర్మించిన ఈ సినిమాతోనే దివ్యభారతి తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయ్యింది. వెంకటేష్‌కు మాస్ ఇమేజ్ తీసుకువచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో పాటలు సీతారామశాస్త్రి రాయగా ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. 3 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.
బొబ్బిలి రాజా పాటలు నాడు ఆంధ్రదేశాన్ని కమ్మేశాయి. ఎక్కడ చూసినా ఆ పాటలే వినిపించాయి. ఈ రెండు సినిమాల్లో భారీ అంచనాలతో వచ్చిన చిరంజీవి రాజా విక్రమార్క్ అంచనాలు అందుకోలేదు. బొబ్బిలి రాజా మాత్రం క్లీన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.