క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కెరీర్‌కు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య సినిమా బీజం వేసింది. బన్నీకి కెరీర్‌లో ఆర్య రెండో సినిమా. ఆ సినిమాతోనే యూత్‌లో మనోడికి పిచ్చ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత బన్నీ – సుక్కు కెరీర్‌లో మరోసారి ఆర్య 2తో పాటు తాజాగా పుష్ప సినిమాతో మరోసారి జోడీ కట్టారు. ఇప్పుడు పుష్పకు సీక్వెల్‌గా మరోసారి పుష్ప 2 వస్తోంది. మామూలుగా సుకుమార్ కెరీర్‌కు సినిమా పరంగా బీజం వేసింది ఎవరు అంటే ఆర్య సినిమాయో లేదా ఆయనకు లైఫ్ ఇచ్చిన బన్నీ లేదా నిర్మాత దిల్ రాజు.. లేదా ఆయన అసిస్టెంట్‌గా పనిచేసిన వివి. వినాయక్ పేర్లు చెప్పాలి.
కానీ సుకుమార్ సినీ కెరీర్ స్ఫూర్తిగా ప్రేరణ వీళ్లెవ్వరు కాదట. యాంగ్రీ యంగ్‌మ్యాన్ అయిన సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్. ఆయన్ను చూడడం వల్లే చిన్నప్పటి నుంచి తనకు చిన్నప్పటి నుంచి సినిమాల పట్ల ఆసక్తి పెరిగిందని కూడా సుక్కు చెప్పాడు. తన సినీ జీవితానికి బీజం వేసిన వ్యక్తిగా రాజశేఖర్ అంటూ సుక్కు ఆకాశానికి ఎత్తేశాడు. అయితే దీనికి సుక్కు ఓ లాజిక్ కూడా చెప్పాడు.
తనకు ఊహా తెలిసిన తర్వాత తాను మొదటిసారిగా అనుకరించిన హీరో రాజశేఖర్ అని… తన ఫ్రెండ్ ఒకడు అందరు స్టార్ హీరోలను ఇమిటేట్ చేసేవాడని.. అందుకు భిన్నంగా తాను కూడా ఎవరిని అయినా అనుకరించాలని డిసైడ్ అయ్యి.. తాను మొదటిసారిగా రాజశేఖర్‌ను అనుకరించానని సుక్కు చెప్పాడు. ఆ తర్వాత స్కూల్లో ఏది జరిగినా కూడా అందరూ తనను రాజశేఖర్‌ను ఇమిటేట్ చేయమని అడగడంతో తాను ఫేమస్ అవ్వడంతో పాటు తనకు తెలియకుండానే సినిమాల పట్ల ఆసక్తి పెరిగిందని చెప్పారు.
రాజశేఖర్ నటించిన శేఖర్ ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో చిన్నప్పుడు తనకు రాజశేఖర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు సుకుమార్. ఈ విషయాన్ని తాను కూడా ఆయనకు ఎన్నోసార్లు చెప్పాలని అనుకున్నానని..అయితే సందర్భం రాలేదని.. ఇప్పుడు శేఖర్ ప్రి రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా టైం రావడంతో ఆ విషయం బయట పెట్టానని సుకుమార్ చెప్పాడు.
ఇక రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ సినిమాకు జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించారు. మలయాళీ హిట్ సినిమాకు రీమేక్‌గా శేఖర్ వస్తోంది. ప్రతి ఒక్కరు తమ జీవితంతో కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందని జీవిత చెపుతున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.