MoviesNBK # 107 లో బాల‌య్య సాంగ్‌.. మామూలుగుండ‌దీపాట‌..!

NBK # 107 లో బాల‌య్య సాంగ్‌.. మామూలుగుండ‌దీపాట‌..!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానుల‌కు జై బాల‌య్య అనే మాట పెద్ద తార‌క‌మంత్రం. జై బాల‌య్య అన్న ప‌దంతో నంద‌మూరి అభిమానులు ఎలా ఊగిపోతారో తెలిసిందే. తాజాగా వ‌చ్చిన బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ అఖండ సినిమాలో సైతం జై బాల‌య్యా సాంగ్ ఎంత పెద్ద ర‌చ్చ లేపిందో చూశాం. అస‌లు ఈ సినిమా ఇప్ప‌ట‌కీ ఎక్క‌డ ఆడుతున్నా కూడా జై బాల‌య్య సాంగ్‌ను రిపీట్ చేసి మ‌రీ చూస్తున్నారు. అఖండ ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌తో పాటు క‌ర్నాక‌ట‌లో ప‌లు ప్రోగ్రామ్‌లు, ఫంక్ష‌న్లు, పండ‌గ‌ల్లో వీథి తెర‌ల్లో ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

అఖండ సినిమా వేశారంటే చాలు జై బాల‌య్యా సాంగ్ రిపీట్ కావాల్సిందే. అఖండ త‌ర్వాత బాల‌య్య ఇప్పుడు మ‌లినేనీ గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా న‌డుస్తోంది. ఈ సినిమాలో కూడా బాల‌య్య పేరు క‌లిసి వ‌చ్చేలా ఓ మాస్ సాంగ్ ఉంటుంద‌ట‌. బాల‌య్య పేరుతో సాంగ్స్ వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు కొట్ట‌డం.. ఇప్ప‌టి నుంచే కాదు ఎప్ప‌టి నుంచో ఉంది.

లారీ డ్రైవ‌ర్ సినిమాలో బాల‌య్య బాల‌య్య గుండెల్లో బాల‌య్య సాంగ్ అప్ప‌ట్లో ఓ ఊపు ఊపేసింది. ఇక అఖండ జై బాల‌య్య సాంగ్ వ‌స్తున్నా కూడా ప్ర‌తి ఒక్క‌రు పూన‌కం ప‌ట్టిన‌ట్టు ఊగిపోతూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ప్ర‌తి కాలేజ్‌లోనూ జై బాల‌య్య సాంగ్‌కు ఆడ‌, మ‌గ తేడా లేకుండా డ్యాన్సులు వేస్తున్నారు. తాజాగా మలినేనీ గోపి సినిమాలో సైతం బాల‌య్య ప‌దం వ‌చ్చేలా ఓ మాస్ సాంగ్ ఉంటుంద‌ట‌.

తాజాగా ఈ సాంగ్‌పై ఓ క్రేజీ సెల్ఫీ కూడా రిలీజ్ చేశారు. ఈ సెల్ఫీ ఇప్పుడు మామూలుగా వైర‌ల్ కావ‌డం లేదు. ఈ సెల్ఫీ తో పాటు ఈ సాంగ్ రాసిన ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి అయితే ఈ సాంగ్ మామూలుగా ఉండ‌దు… తాను అభిమానుల‌కు ముందే ప్రామీసింగ్ చేస్తున్నా అని కాన్పిడెంట్‌గా చెప్పారు.

ఈ సాంగ్‌పై అంత కాన్ఫిడెంట్‌గా చెప్ప‌డంతో బాల‌య్య అభిమానుల‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రిలోనూ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. థ‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ఆల్బ‌మ్‌తో పాటు బీజీఎం కూడా అదిరిపోతుంద‌ట‌. అఖండకు థ‌మ‌న్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్ప‌ట‌కీ చెవుల్లో మార్మోగుతూనే ఉంటుంది. ఇక మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

Latest news