త్రిబుల్ ఆర్ సినిమా వచ్చేసి 50 రోజులు దాటిపోయింది. మరోవైపు ఆచార్య కూడా వచ్చి వారం రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర క్లోజ్ అయ్యింది. ఎన్టీఆర్ – కొరటాల ఇద్దరూ ఫ్రీ అయిపోయారు. అయినా కూడా వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా మాత్రం ఇంకా పట్టాలు ఎక్కడం లేదు. ఆచార్యకు ఎప్పుడో ఆరు నెలల ముందే ఎన్టీఆర్ సినిమా స్క్రిఫ్ట్ కొరటాల కంప్లీట్ చేసుకుని ఉన్నారన్న ప్రచారం గట్టిగా జరిగింది. ఇప్పుడేమో అదిగో షూటింగ్… ఇదిగో అంటున్నారే తప్పా ఏం అప్‌డేట్లు లేవు.
ఆచార్య దెబ్బతో కొరటాల కథలో ముందు అనుకున్న దానికంటే మార్పులు, చేర్పులు చాలానే చేస్తున్నాడని ఓ టాక్ అయితే బయటకు వచ్చింది. ఆచార్య దెబ్బతో కొరటాల ముందు సంపాదించుకున్న క్రేజ్‌చాలా తగ్గింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కాస్త అటూ ఇటూ అయితే కొరటాల పూర్తిగా ఇండస్ట్రీలో బ్యాడ్ అయిపోతాడు… ఎవ్వరూ నమ్మే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు వెలిగిన శ్రీను వైట్ల పరిస్థితి ఏం అయ్యిందో ఇప్పుడు కొరటాలకు అదే పరిస్థితి వచ్చేస్తుంది.
అందుకే కొరటాల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన తీసుకుంటున్నాడు. మరోవైపు ఎన్టీఆర్‌తో సినిమాలు చేసేందుకు చాలా మంది డైరెక్టర్లు కాచుకుని ఉన్నారు. ఇటు కొరటాల.. ఆ తర్వాత మైత్రీ వాళ్లు… బుచ్చిబాబు డైరెక్షన్‌లో చేసే సినిమా కోసం కాచుకునే ఉన్నారు. బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్ కోసమే వెయిటింగ్‌లో ఉన్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా సలార్ పూర్తి చేసి ఎన్టీఆర్ డేట్లు కోసమే లైన్లో ఉన్నాడు.
ఎన్టీఆర్ ముందు కొరటాల సినిమాను పూర్తి చేస్తేనే వెంటనే ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు సినిమాలు చేసే వీలుంటుంది. కానీ ఎందుకో కొరటాల ఎన్టీఆర్ ను ఇక్కడే స్ట్రక్ చేసి పడేస్తున్నాడు. ఆచార్య తర్వాత కొరటాలలో ఏదో కాన్ఫిడెన్స్ తగ్గింది. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కూడా కొరటాలతో ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ హీరో సినిమా చేయడం ఇష్టం లేనట్టుగా ఉంది. సోషల్ మీడియాలో చాలా మంది కొరటాల కంటే మరో డైరెక్టర్‌తో తారక్ సినిమా చేస్తేనే బెటర్ అన్న చర్చకు తెరలేపుతున్నారు.
కొరటాలకు పాన్ ఇండియా రేంజ్ ఉందా ? అన్నదే వారి బాధ. త్రిబుల్ ఆర్‌తో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్‌ను కొరటాల కంటిన్యూ చేస్తాడా ? అన్న సందేహం తారక్ అభిమానులకే కాదు… ప్రతి ఒక్కరికి ఉంది. ఏదేమైనా మరో 3 రోజుల్లో తారక్ పుట్టిన రోజు కావడంతో తన కొత్త సినిమాలపై ఓ క్లారిటీ ఇచ్చేస్తే ఫ్యాన్స్ కాస్త ఖుషీలో ఉంటారు.