నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ ప్లాపుల తర్వాత అఖండతో అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెద్ద హీరోలు థియేటర్లలో తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు భయపడుతోన్న వేళ బాలయ్య డేర్ చేసి మరీ తన సినిమాను రిలీజ్ చేయించాడు. అఖండ థియేటర్లను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమా ఏకంగా రు. 200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో బాలయ్య వరుస పెట్టి క్రేజీ డైరెక్టర్లకు ఓకే చెపుతున్నాడు
అఖండ తర్వాత బాలయ్య మాస్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రాక్ తర్వాత గోపీచంద్ అదిరిపోయే పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను వచ్చే దసరాకు రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతరం అనిల్ రావిపూడి సినిమాకు బాలయ్య గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు.
అనిల్ రావిపూడి ఇప్పుడు వరుస హిట్లతో మామూలు స్వింగ్‌లో లేడు. బాలయ్య కోసం కామెడీ, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ స్టోరీని రెడీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై బాలయ్య అభిమానులు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఖచ్చితంగా అఖండ, మలినేని గోపీ సినిమా.. ఆ వెంటనే అనిల్ రావిపూడి సినిమాలతో బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ పడుతుందనే నమ్మకంతో అందరూ ఉన్నారు.
ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య మళ్లీ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో సింహా.. లెజెండ్ మరియు అఖండ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా వస్తుందని … అది కూడా పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని అంటున్నారు.
2024 ఎన్నికలకు కాస్త ముందుగా రిలీజ్ అయ్యేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం బోయపాటి టీం ఇప్పటికే కసరత్తులు కూడా స్టార్ట్ చేసేసింది. ఏదేమైనా బాలయ్య నెక్ట్ప్ మూడు సినిమాలు కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ స్ట్రాంగ్ లైనప్‌తో బాలయ్య బ్లాక్‌బస్టర్ హ్యాట్రిక్ కొడతారనే అందరూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.