సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట క్రేజ్ ఉత్తరాంధ్రలో క్లియర్ గా కనిపించింది. గత మూడేళ్లుగా ఉత్తరాంధ్రలో సినిమా వసూళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉత్తరాంధ్రకే గుండెకాయ లాంటి వైజాగ్ సిటీలో కొత్త సినిమాలకు, స్టార్‌హీరోల సినిమాలకు క్రేజ్ మమూలుగా ఉండడం లేదు. ఉత్తరాంధ్ర వసూళ్లలో సింహభాగం వైజాగ్ నుంచే ఉంటున్నాయి.
తాజా సర్కారు వారి పాట బన్నీ పుష్ఫ, యష్ కేజిఎఫ్2ల టోటల్ రన్ ను ఫస్ట్ వీకెండ్ లో దాటేయడం చూస్తుంటే ట్రేడ్ వర్గాలకే మతులు పోతున్నాయి. పైగా ఈ సినిమా దర్శకుడు పరశురాం కూడా ఉత్తరాంధ్రకే చెందిన వ్యక్తి. పుష్ప, కేజీయఫ్ 2 రెండూ కూడా లాంగ్ రన్లో కూడా ఉత్తరాంధ్రలో రు. 8 కోట్ల షేర్ రాబట్టుకోలేదు.
అయితే సర్కారు వారి పాట ఉత్తరాంధ్రలో తొలి నాలుగు రోజుల్లోనే ఎనిమిది కోట్ల షేర్ దాటేయడం చూస్తుంటే మహేష్‌కు ఇది ఎంత కంచుకోటో అర్థమవుతోంది. ఫస్ట్ డే 3.27 కోట్లు, రెండో రోజు 1.54 కోట్లు, మూడో రోజు 1.55 కోట్లు వసూలు చేసింది. ఆదివారం కూడా మార్నింగ్ షో నుంచే హౌస్‌ఫుల్స్ పడ్డాయి. దీనిని బట్టి చూస్తుంటే 4 రోజులకే ఎనిమిది కోట్లు దాటేయడం ఖాయమైంది.
ఈ సినిమాను ఉత్తరాంధ్ర ఏరియాకు రు. 12 కోట్లకు అమ్మారు. అంటే మరో రు. 4 కోట్ల షేర్ రావాల్సి ఉంది. బ్రేక్ ఈవెన్ కళ్లు మూసుకుని దాటేయనుంది. అయితే రు. 12 కోట్ల షేర్ దాటేసి.. ఆ పైన ఎంత వసూలు చేస్తుంది అన్నదే ఆసక్తిగా మారింది. పైగా పుష్ప, కేజీయఫ్ 2 సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ రన్ స్టార్ట్ చేశాయి. సర్కారు వారి పాటకు మిక్స్ డ్ టాక్ వచ్చినా వసూళ్ల ఊచకోత కోస్తోంది.
అయితే కేజీయఫ్ 2, పుష్పకు అక్కడ నార్మల్ రేట్లు అమ్మారు. సర్కారు వారి పాటకు మాత్రం రు. 50 అదనపు రేటు వచ్చింది. దీనికి తోడు మహేష్ రెండున్నర సంవత్సరాల తర్వాత థియేటర్లలోకి రావడంతో జనాలు అందరూ మహేష్‌ను ఎలాగైనా చూడాలని థియేటర్లకు పోటెత్తడంతో వసూళ్ల వరద పారింది.