Moviesలియాండ‌ర్ పేస్‌ను పెళ్లాడుతున్న హీరోయిన్‌ కిమ్‌శ‌ర్మ బ్రేక‌ప్‌ల క‌థ పెద్ద‌దే...!

లియాండ‌ర్ పేస్‌ను పెళ్లాడుతున్న హీరోయిన్‌ కిమ్‌శ‌ర్మ బ్రేక‌ప్‌ల క‌థ పెద్ద‌దే…!

సినిమా వాళ్ల‌కు, ఆట‌గాళ్ల‌కు మ‌ధ్య రిలేష‌న్లు, ఎఫైర్లు ఈనాటివి కావు. బాలీవుడ్‌కు, ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌కు మ‌ధ్య ఎఫైర్లు 1970వ ద‌శ‌కం నాటి నుంచే ఉన్నాయి. మ‌న బాలీవుడ్ హీరోయిన్లు విదేశీ క్రికెట‌ర్ల‌తో కూడా ఎఫైర్లు పెట్టుకున్నారు. ముందు డేటింగ్‌లో మునిగి తేల‌తారు. ఫుల్లుగా పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంటారు. క‌ట్ చేస్తే పెళ్లి చేసుకున్నా… ఎన్నో యేళ్లు వీరి బంధాలు నిల‌వ‌వు.. మ‌ళ్లీ విడాకులు తీసేసుకుంటారు.

ఓ ముదురు హీరోయిన్ చాలా మందితో డేటింగ్‌లు, బ్రేక‌ప్‌ల త‌ర్వాత ఇప్పుడు ఓ టెన్నీస్ స్టార్‌తో ప్రేమ‌లో ప‌డి పెళ్లికి సిద్ధ‌మ‌వుతోంది. కిమ్ శ‌ర్మ అంటే ఈ త‌రం జ‌న‌రేష‌న్ అభిమానుల‌కు పెద్ద‌గా తెలియ‌దు కాని.. రెండు ద‌శాబ్దాల క్రితం ఆమె బాలీవుడ్‌తో పాటు ఇటు సౌత్‌లో కూడా పాపుల‌రే. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఖ‌డ్గం సినిమాలో ముసుగు వేయొద్దు మ‌న‌సుమీద సాంగ్ ఇప్ప‌ట‌కీ మ‌న‌కు గుర్తుంటుంది.

ఆ త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఆమె రామ్‌చ‌ర‌ణ్ మ‌గ‌ధీర సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. బాలీవుడ్‌లో అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేసుకుంటూ వ‌చ్చిన కిమ్‌శ‌ర్మ ఎక్కువుగా లైమ్‌టైమ్‌లో లేదు. అయితే ఇప్పుడు లియాండ‌ర్ పేస్‌తో పెళ్లికి సిద్ధ‌మ‌వుతోన్న కిమ్ ఇంత‌కు ముందే చాలా ప్రేమ‌లు, డేటింగ్‌లతో పాటు పెళ్లి చేసుకుని విడాకులు కూడా ఇచ్చేసింది.

ముందు ఆమె ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌తో డేటింగ్ చేసింది. వీరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటోన్న టైంలో బ్రేక‌ప్ అయ్యింది. యువ‌రాజ్‌కు హాలీవుడ్ న‌టితో పెళ్ల‌యిపోయింది. ఆ త‌ర్వాత 2010లో కెన్యాకు చెందిన ఓ వ్యాపార‌వేత్త‌తో కిమ్ పెళ్లి జ‌రిగింది. స‌ద‌రు వ్యాపార‌వేత్త కిమ్ కంటే వ‌య‌స్సులో చాలా పెద్ద అయినా.. కేవ‌లం డ‌బ్బుకోస‌మే అత‌డిని పెళ్లి చేసుకుంద‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది. అయితే అత‌డి వేధింపులు తట్టుకోలేక విడాకులు ఇచ్చేసి ఆమె ఇండియాకు వ‌చ్చేసింది.

ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో హర్షవర్ధన్ రాణెతో డేటింగ్‌లో ఉంది. వీరిద్ద‌రు ఫుల్లుగా డేటింగ్‌లో మునిగి తేలారు. ఇప్పుడు ఆమె మాజీ టెన్నీస్ ప్లేయ‌ర్ లియాండ‌ర్ పేస్‌తో లివిన్ రిలేష‌న్‌షిప్ కొన‌సాగిస్తోంది. అటు పేస్‌కు కూడా గతంలో పెళ్లి అయ్యి… విడాకులు వ‌చ్చాయి.చాలా మందితో బ్రేక‌ప్‌లు అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ ముదురు జంట ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి రెడీ అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news