రెండు దశాబ్దాల క్రిందట మళయాళీ అమ్మాయిగా ఇక్కడకు వచ్చింది సుమ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సినిమాలో హీరోయిన్గా పరిచయం అయ్యింది. మళయాళీ అమ్మాయి అయనా ఆ తర్వాత తెలుగు నేర్చుకుని తెలుగు బుల్లితెరను దశాబ్దకాలంగా దున్నేస్తూ వస్తోంది. అసలు తెలుగు యాంకరింగ్ అంటే సుమ.. సుమ అంటే తెలుగు యాంకరింగ్ అనేంతగా సుమ వెలిగిపోయింది.
అయితే ఇప్పుడిప్పుడే వస్తోన్న కొత్త యాంకర్లు, కుర్ర యాంకర్లు, హాట్ యాంకర్లతో ఆమెకు లైట్‌గా పోటీ ఎదురవుతోంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సుమ జయమ్మ పంచాయితీ సినిమాతో మళ్లీ వెండితెరపై కనిపించింది. రిలీజ్‌కు ముందు ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించినా కూడా జయమ్మ పంచాయితీ సక్సెస్ కాలేదు. ఈ సినిమాకు రు 3.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బుల్లితెరపై పనిచేసిన సుమ మ్యాజిక్ వెండితెరపై పనిచేయలేదు.
ఇక యాంకర్‌గా ఆమె ఎన్నో ఈవెంట్లు, సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్లు, ఆడియె ఫంక్షన్లు, విజయోత్సవ ఫంక్షన్లు అన్ని కూడా ఆమె వన్ మ్యాన్ షో చేస్తూ ఉంటుంది. ఆమె ఒక్కో ఈవెంట్‌కు తీసుకునే రెమ్యునరేషన్ కనిష్టంగా రు. 2 లక్షలు ఉండగా.. గరిష్టంగా రు. 5 లక్షల వరకు ఉంటుందట. ఒక్కో ప్రి రీలీజ్ ఈవెంట్‌కు ఆమె రు. 4 – 5 లక్షల మధ్యలో డిమాండ్ చేస్తుందట.
47 సంవత్సరాల వయస్సు ఉన్నా కూడా సుమ యాంకరింగ్‌కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. స్టార్ హీరోలు, దర్శకులు సైతం ఆమెనే అభిమానిస్తారు. సుమ ఇంటర్వ్యూ అంటే ఖచ్చితంగా ఇస్తారు. సుమ ప్రమోషన్లు, ఇంటర్వ్యూలకు మామూలు రెస్పాన్స్ ఉండదు. ఆమె యేడాదికి ఒక స్టార్ హీరోయిన్ సంపాదించే రెమ్యునరేషన్, సంపాదన కంటే చాలా ఎక్కువే ఉంటుందట.
గత పదేళ్లలోనే సుమ సంపాదన కోట్లలో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. భర్త రాజీవ్ కనకాల కంటే కూడా సుమ సంపాదనే ఎక్కువ ఉందని అంటారు. ఇక జయమ్మ పంచాయితీకి కూడా ఆమెకు భారీగానే రెమ్యునరేషన్ ముట్టిందని అంటారు.