ఎవరైనా ఒకళ్లు బాగుడపతున్నారు అంటే ఓర్చలేని వాళ్లు ఎక్కువ అయిపోతున్నారు. మనుష్యుల్లో ఈర్ష్య, అసూయ, దుర్బుద్ధి బాగా పెరిగిపోతున్నాయి. ఇండస్ట్రీలోనూ ఇవి కామన్ అయిపోయాయి. దర్శకులు, నిర్మాతల మధ్య మాత్రమే కాదు.. చివరకు డిస్ట్రిబ్యూటర్ల మధ్య కూడా ఆధిపత్యం కోసం ఎలాంటి కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయో ఇటీవల జరుగుతున్న పరిణామాలే చెపుతున్నాయి.
తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా కోసం తనకు తానుగా ప్రమోషన్ కోసం ఏదో ఫ్రాంక్ వీడియో చేసుకుంటూ దానిని టీవీ 9 పెద్ద వివాదంలా చూపించాలని భంగపడింది. పాగల్సేన్ అంటూ టైటిల్ పెట్టి నానా రచ్చ చేయబోయింది. చివరకు విశ్వక్ స్టూడియోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ వివాదంలో చాలా మంది టీవీ 9 యాంకర్ దేవీనే సోషల్ మీడియాలో ఓ ఆటాడుకున్నారు.
దీంతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం వెళ్లినా చొప్పున చల్లారిపోయింది. ఇక సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. మాంచి వసూళ్లు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాను దెబ్బ తీసేందుకు కొందరు అప్పుడే కుట్రలకు తెరలేపారు. అశోకవనంలో సినిమా అప్పుడే ఓటీటీలో వచ్చేస్తుందని.. దీనిని థియేటర్లలో ఎవరూ చూడాల్సిన అవసరం లేదని ప్రచారం చేస్తున్నారు.
ఎలాగైనా ఈ సినిమా వసూళ్లను దెబ్బకొట్టే లక్ష్యంతోనే ఈ సినిమాను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంపై విశ్వక్ స్పందించాడు. మా సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవదాలు అని.. ప్రేక్షకులు చూపించిన అభిమానంతో తాను మరిన్ని హిట్ సినిమాలు చేస్తానని అన్నాడు. ఇక మా సినిమా త్వరలోనే టీవీలో వచ్చేస్తుందని.. ఓటీటీలో వస్తుందని కొందరు పుకార్లు ప్రచారాలు చేస్తున్నారని.. ఇవన్నీ అబద్ధాలు అని కొట్టి పడేశాడు.
ఇలా పోస్టులు పెడుతోన్న వారు వాటిని తొలగించాలని కూడా విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాకు మాంచి లాభాలు వస్తున్నాయి.. కావాలనే కొందరు ఈ పోస్టులతో టార్గెట్ చేసినట్టు టాక్ ?