Moviesఆ డైరెక్ట‌ర్ కెరీర్‌తో మెహ్రీన్ ఆట‌లు... టాలీవుడ్ హాట్ టాపిక్‌...!

ఆ డైరెక్ట‌ర్ కెరీర్‌తో మెహ్రీన్ ఆట‌లు… టాలీవుడ్ హాట్ టాపిక్‌…!

మెహ్రీన్ కెరీర్ అస‌లే అంతంత మాత్రంగా ఉంది. ఆమెకు ఛాన్సులు ఇచ్చే వాళ్లే క‌న‌ప‌డ‌డం లేదు. ఎఫ్ 2 పుణ్యాన అనిల్ రావిపూడి అదే టీంను కంటిన్యూ చేయ‌డంతో ఎఫ్ 3 లో ఛాన్స్ ఇచ్చింది. ఇది కూడా ఎప్పుడో రెండేళ్ల క్రితం ఆమెకు వ‌చ్చిన ఛాన్సే. ఆ మ‌ధ్య మాజీ ముఖ్య‌మంత్రి మ‌న‌వ‌డితో పెళ్లి త‌ర్వాత క్యాన్సిల్ కావ‌డం ఇలా చాలా ర‌కాలుగా ఆమె వార్త‌ల్లో నిలుస్తోంది.

ఇదిలా ఉంటే ఆమెకు మ‌రీ చెప్పుకోద‌గ్గ సినిమా ఛాన్సులు లేక‌పోవ‌డంతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే ప్ర‌య‌త్నాల్లో కూడా ఉంది. అయితే ఇక్క‌డే ఆమె అతి తెలివితేటలు చూపిస్తూ ఓ యంగ్ డైరెక్ట‌ర్ కెరీర్‌తో ఆట‌లాడుకుంటోంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. మెహ్రీన్ త‌న ద‌గ్గ‌ర‌కు ఓటీటీ ఆఫ‌ర్ల‌తో వ‌చ్చిన నిర్మాత‌ల‌ను మ‌భ్య‌పెడుతూ వ‌స్తోంద‌ట‌.

ఓ ఓటీటీ సినిమా ఆఫ‌ర్ వస్తే చేయ‌ను.. చేస్తాని అని చెప్ప‌కుండా చూద్దాం అంటూ త‌న వెంట తిప్పించుకుంటోంద‌ట‌. ఓ యంగ్ డైరెక్ట‌ర్ ఓటీటీ క‌థ‌తో ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడ‌ట‌. వాస్త‌వంగా ఆమె ఓటీటీ సినిమా చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌. అయితే ఆ క‌థ వ‌దులుకోలేక చేద్దాం అని ఆ డైరెక్ట‌ర్‌ను ఊరించింద‌ట‌. అయితే మెహ్రీన్‌తో ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా ఏంట‌ని నిర్మాత చేతులు ఎత్తేశాడు.

చివ‌ర‌కు మెహ్రీన్ తానే నిర్మాత‌ను చూస్తాన‌ని ఆ యంగ్ డైరెక్ట‌ర్‌కు అభ‌యం ఇవ్వ‌గా.. మ‌నోడు గాల్లో తేలిపోయాడ‌ట‌. నాలుగు నెల‌లు దాటుతున్నా మెహ్రీన్ నిర్మాత‌ల‌ను చూడ‌క‌పోవ‌డంతో పాపం ఆ డైరెక్ట‌రే మ‌రో నిర్మాత‌ను తెచ్చుకున్నాడ‌ట‌. అయితే ఇప్పుడు మెహ్రీన్ దీనిని సినిమాగా తీద్దామ‌ని కండీష‌న్ పెడుతోంద‌ట‌.

పాపం ఆ డైరెక్ట‌ర్ అందుకు కూడా ఒప్పుకున్నాడ‌ట‌. అయితే త‌న‌కు రు. 80 ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్ ఇస్తేనే కాల్షీట్లు ఇస్తాన‌ని చెప్ప‌డంతో ఆ డైరెక్ట‌ర్ అవాక్క‌య్యాడ‌ట‌. ఎందుకంటే అస‌లే ఆ క‌థ సినిమాగా సెట్ కాదు. బీ, సీ సెంట‌ర్ల‌కు ఎక్క‌దు. అయినా రిస్క్ చేసి సినిమాగా చేద్దామ‌నుకుంటే ఇప్పుడు ఆమె ఇన్నీ డ్రామాలు ఆడుతోంద‌ని స‌న్నిహితుల వ‌ద్ద వాపోయాడ‌ట‌. ఇప్పుడు ఈ విష‌యం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news