ఈ జనరేషన్ లో హీరోలు ఏడాది ఒకటే సినిమా చేస్తున్నారు. ఎవరో కొందరు మాత్రమే రెండేసి సినిమాలు చేస్తున్నారు. కానీ, ఒకప్పుడు మాత్రం హీరోలు ఏడాది ఐదారు సినిమాలు చేసేవారు. అలా అతి తక్కువ సమయంలో తమ సినీ కెరీర్లో వంద సినిమాలను పూర్తి చేసి సెంచరీ కొట్టిన హీరోలు టాలీవుడ్లో 14 మంది ఉన్నారు. మరి ఆ హీరోలు ఎవరెవరో చూసేయండి.
నందమూరి తారక రామారావు: సామాన్యుడిగా మొదలై, అసామాన్యుడిగా నిలిచి, గెలిచిన నందమూరి తారకరామారావు తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారి వంద సినిమాలను పూర్తి చేసుకున్నారు. ఈయన వందో చిత్రం గుండమ్మ కథ. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు కూడా నటించారు. 1962లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
అక్కినేని నాగేశ్వరావు: ఎన్టీఆర్ తర్వాత సెంచరీ కొట్టిన హీరో అక్కినేని నాగేశ్వరావు. గుండమ్మ కథ రీమేక్ తో ఆయన 100 చిత్రాల మైలురాయిని అందుకున్నారు
సూపర్ స్టార్ కృష్ణ: టాలీవుడ్లో 100 చిత్రాల మైలురాయిని అందుకున్న మూడో హీరో ఈయన. 1974లో విడుదలై సంచలన విజయం నమోదు చేసిన `అల్లూరి సీతారామరాజు` కృష్టకు వందో చిత్రం.
శోభన్ బాబు: కృష్ట తర్వాత శోభన్ బాబునే 100 చిత్రాలను పూర్తి చేసిన హీరోగా నిలిచారు.1978 వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన `నిండు మనిషి`తో శోభన్ బాబు సెంచరీ కొట్టారు.
కృష్ణంరాజు: టాలీవుడ్లో వంద చిత్రాలను పూర్తి చేసిన హీరోల్లో కృష్ణంరాజు ఒకరు. `రంగూన్ రౌడీ` ఆయన 100వ చిత్రం.
మురళీమోహన్: హీరోగానే కాకుండా సహాయ పాత్రలను కూడా పోషించిన మురళీ మోహన్.. `వారాలబ్బాయి`తో 100 చిత్రాల మైలురాయిని అందుకున్నాడు.
శరత్ బాబు: `చల్లకుట్టి` అనే తమిళ్ చిత్రంలో శరత్ బాబు సెంచరీ కొట్టారు.
చిరంజీవి: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 100 చిత్రాలను పూర్తి చేసిన హీరోల్లో ఒకరు. చిరంజీవికి వందో చిత్రం `త్రినేత్రుడు`
నందమూరి బాలకృష్ణ: `గౌతమీపుత్ర శాతకర్ణి`తో నటసింహం నందమూరి బాలకృష్ణ 100 చిత్రాలను పూర్తి చేసి సెంచరీ కొట్టేశారు.
మోహన్ బాబు: 100 చిత్రాల మైలురాయిని అందుకున్న హీరోల్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకరు. ఇప్పటి వరకు ఐదు వందల సినిమాలు చేసిన ఈయనకు `మాయాబజార్`తో వందో చిత్రం.
రాజేంద్రప్రసాద్: హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ప్రేక్షకులను అలరించిన రాజేంద్రప్రసాద్ `చెట్టు కింద ప్లీడర్` తో సెంచరీ కొట్టారు.
సుమన్: వంద సినిమాలను కంప్లీట్ చేసిన హీరోల్లో సుమన్ ఒకరు. `అయ్యప్ప కటాక్షం` ఈమన వందో చిత్రం.
సురేష్: హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయిన సురేష్.. `సూరిగాడు`తో 100 చిత్రాల మైలురాయిని రీచ్ అయ్యారు.
శ్రీకాంత్: `మహాత్మ`తో శ్రీకాంత్ వంద సినిమాలను పూర్తి చేసుకున్న హీరోల్లో ఒకరిగా నిలిచారు.
జగపతి బాబు: ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు పొందిన జగపతి బాబు.. ఇప్పుడు విలన్‌గా మరియు సహాక పాత్రను పోషిస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఈయన వందో చిత్రం `కరెంటు తీగ` అయితే ఇందులో ఆయన హీరోగా కాకుండా సహాయ పాత్రను పోషించారు.