టాలీవుడ్‌లో నెంబర్ గేమ్ అనేది ప్రతి శుక్రవారం మారిపోతూ ఉంటుంది. ఈ రోజు జీరోగా ఉన్నోడు.. రేపు రిలీజ్ అయ్యే తన సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ వస్తే హీరో అయిపోతాడు. ఈ రోజు వరకు హీరోగా ఉన్నోడు ఒక్క ప్లాప్ పడితే చాలు పాతాళంలోకి వెళ్లిపోతాడు. ఒకప్పుడు తమను కలవాలంటే స్టార్ హీరోలనే వెయిట్ చేయించిన స్టార్ డైరెక్టర్లను ఈ రోజు మీడియం రేంజ్ హీరోలే కలిసేందుకు ఇష్టపడడం లేదు. కారణం వారు ప్లాపుల్లో ఉండడమే. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా సక్సెస్‌కే క్రేజ్ ఉంటుంది.. అది ఏ రంగం అయినా కావచ్చు.. వాళ్లు గతంలో ఎంత పెద్ద తోపులు అయినా.. ఇప్పుడు సక్సెస్ ఉందా ? లేదా ? అన్నదే చూస్తారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్‌స్టర్స్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. నెంబర్ వన్ హీరో ఎవరు ? అన్న ప్రశ్నకు ప్రధానంగా వినిపించే పేర్లు సూపర్‌స్టార్ మహేష్‌బాబు – యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇక బాహుబలి తర్వాత యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ రేసులోకి వచ్చాడు. ఆ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సైతం తాను పోటీలో ఉన్నానని దూసుకు వస్తూ ఉంటారు.
ఎవరు నెంబర్ వన్ అన్న ప్రశ్నకు పై హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ వార్ నడుస్తూనే ఉంటోంది. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఓ విశ్లేషణ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అన్న ప్రశ్నకు ఆయన ఆన్సర్ ఇస్తూ ప్రస్తుతం ఈ రేసులో బన్నీ – ఎన్టీఆర్ ఇద్దరూ దూసుకుపోతున్నారు అనడంతో పాటు ఎన్టీఆరే కాస్త ఓ ఇంచ్ పైన ఉన్నట్టు మాట్లాడారు.
పుష్ప తర్వాత బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది అని.. ఇక తాజాగా త్రిబుల్ ఆర్‌తో ఎన్టీఆర్‌కు కూడా తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిందన్నారు. పైగా ఏ హీరోకు లేనట్టుగా…. ఈ తరం హీరోల్లో 6 వరుస హిట్లతో ఎన్టీఆర్ దూసుకు పోతున్నాడు. పౌరాణికం, సాంఘీకం, చారిత్రకం ఇలా అన్ని పాత్రలు చేయగల నటుడు. పైగా ఎన్టీఆర్ నెక్ట్స్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మరో క్రేజీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ గేమ్‌లోకి ఇంకా మహేష్ రాలేదని భరద్వాజ్ చెపుతున్నారు. మహేష్ ఇక్కడ హిట్ సినిమాలు చేస్తున్నా… నెక్ట్స్ రాజమౌళితో చేసే సినిమా తర్వాత పాన్ ఇండియా / టాలీవుడ్ నెంబర్ వన్ రేసులోకి వస్తాడని.. అయితే ఈ గేమ్ సినిమా జయాపజయాలను బట్టి ఎప్పుడూ మారుతూ ఉంటుందని భరద్వాజ్ చెప్పారు. అయితే ఆయన మాత్రం ఈ గేమ్‌లో ప్రభాస్, రామ్‌చరణ్ పేరు ప్రస్తావించలేదు.