ఒక్కటంటే ఒక్కే సినిమా..పైగా అది కూడా ప్లాప్ టాక్.. డిజాస్టర్ అనే చెప్పాలి ..కానీ ఈ హీరోయిన్ కి వస్తున్న ఆఫర్లు చూసి స్టార్ హీరోయిన్స్ సైతం షాక్ అవ్వాల్సిన పరిస్ధితి కనిపిస్తుంది. పెళ్ళి సందD హీరోయిన్ శ్రీలీల దశ మార్చేసింది ఆ సినిమా. మామూలుగానే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కంట్లో పడిన ఏ హీరోయిన్‌కు అయినా పట్టిందల్లా బంగారం అన్న నానుడి నాలుగు దశాబ్దాల నుంచే ఉంది. సేమ్ టూ సేమ్ మళ్లీ అదే ఫార్ములా ఇక్కడ రిపీట్ అయ్యింది.
పెళ్లిసందD సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ర్యాంకు కోసం దూసుకుపోతోంది. బెంగళూరులో ఉంటూ తెలుగు మూలాలు ఉన్న శ్రీలీల పెళ్లిసందడి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఆరు సినిమాలు రెడీగా ఉన్నాయి. మరో మూడు సినిమా లు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు శ్రీలీల నటించింది హీరోయిన్ గా ఒక్క సినిమానే.. మరి డైరెక్టర్స్ ఏం చూసి అమ్మడికి అవకాశాలు ఇస్తున్నారో మాత్రం అర్ధం కావడంలేదు. పోనీ చిన్న చితకా డైరెక్టర్లు.. కుర్ర హీరో ల సరసన అవకాశం కలిపిస్తున్నారా ..అంటే కాదు.
స్టార్ హీరోలైన మహేష్ బాబు, తారక్, ప్రభాస్..ఇలాంటి బడా హీరోల సరసన ..స్టార్ డైరెక్టర్స్ ఆఫర్స్ ఇస్తుండటం సినీ పెద్దలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతలా శ్రీలీల లో ఏముందా అని ప్రశ్నించుకుంటున్నారు. దీంతో శ్రీలీల ఇన్ని ఆఫర్స్ కొట్టేయడానికి కారణం ఆమె అందం అన్నట్లు టాక్ వినిపిస్తుంది. పైగా వయసు చిన్నదే అయినా.. చూడటానికి బొద్దుగా ముద్దుగా.. స్టార్ హీరోల సరసన సెట్ అవుతుంది. ఫస్ట్ హీరోయిన్ అని చెప్పలేం కానీ..ఖచ్చితంగా సెకండ్ హీరోయిన్ కి బెస్ట్ ఛాయిస్. పై గా ఎక్స్ పోజింగ్ లు అడగకుండానే చేస్తుంది. ఇంతకు మించి డైరెక్టర్స్ కు ఏం కావాలి.. అందుకే శ్రీలీల టైం నడుస్తుంది. మరి చూడాలి ఎంత కాలం నడుస్తుందో అమ్మడి టైం..?