టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి.. మీరు విన్నది నిజమే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమా వల్ల చెప్పులషాపుల పేరునే మార్చేశారు యజమానులు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే లేట్ చేయకుండా అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం. ఎలాంటి బ్యాక్‌గ్రైండ్ లేకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో అంచలంచగా ఎదుగుతూ మెగా సామ్రాజ్యాన్నే నిర్మించారు చిరంజీవి.
ఈయన తన ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశారు. అలాగే ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాలు కూడా చేశారు. అటువంటి వాటిలో `స్వయంకృషి` ఒకటి. చిరంజీవి నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండే సినిమా ఇది. కళా తపస్వి విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి, సుమలత హీరోయిన్లుగా నటించారు.
చిరుకు ఇది రెండో సినిమా కాగా.. పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్‌లో ఏడిద నాగేశ్వరావు దీనిని నిర్మించారు. 1987 సెప్టెంబరు 3న రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. చెప్పుకుట్టే స్థాయి నుంచి స్వయంకృషితో ఓ చెప్పుల షాపు ఓనర్ గా ఎలా ఎదిగాడనేదే ఈ మూవీ స్టోరీ. ఇందులో చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రలో చిరు నటించాడు అనడం కంటే జీవించేశాడు అనడమే ఉత్తమం.
అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. చిరు అప్పటికే విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం సినిమా చూశారట. అందులో కమల్ నటన చూసి మైమరచిపోయిన చిరంజీవి.. తాను కూడా తనలోని నటనకు పదును పెట్టాలని భావించాట. అందులో భాగంగానే.. చెప్పుకుట్టే వ్యక్తి వద్ద ట్రైనింగ్ తీసుకుని మరీ స్వయంకృషి సినిమాలో సాంబయ్య పాత్రను చేశాడట.
కట్ చేస్తే చిరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆయన నటనకు ప్రశంసలు అందాయి. ఈ సినిమాతో కెరీర్‌లోనే తొలిసారి చిరు ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. అలాగే అప్పట్లో స్వయంకృషి క్రియేట్ చేసిన సంచలనాలతో..చాలా మంది చెప్పులు కుట్టే వారు తమ దుకాణాల పేరును `స్వయం కృషి`గా మార్చేశారు. అంతలా ఈ సినిమా వారిని ప్రభావితం చేసింది.