సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఒకానొక టైంలో తన ప్రతి సినిమాకు ఓ కొత్త హీరోయిన్‌తో నటిస్తూ వచ్చేవాడు. గతంలో ఖుష్బూ , టబు, అంజలా ఝవేరి ఆ తర్వాత ఆర్తీ అగర్వాల్, నమిత ఇలా కొత్త హీరోయిన్లతో నటించేందుకే వెంకీ ఇష్టపడేవాడు. ఓ ఫ్రెష్ ఫీల్ ఉంటుందన్నదే వెంకీ నమ్మకం కావచ్చు. ఇక వెంకీ బాలీవుడ్ హీరోయిన్లతో కూడా నటించాడు. శిల్పాశెట్టి, ట్వింకిల్ ఖన్నా, ప్రీతిజింతా, టబు, అంజలా ఝవేరి ఇలా చాలా మంది బాలీవుడ్ భామలతో నటించాడు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ – వెంకీ కాంబినేషన్లో కూడా ఓ సినిమా వచ్చింది. అయితే ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సినిమా పరిశ్రమలో ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. సౌత్‌లో హిట్ అయిన సినిమాను హిందీలో.. హిందీలో హిట్ అయిన సినిమాలను సౌత్ లో రీమేక్ చేయడం మామూలే.
అప్పట్లో తెలుగు హిట్ సినిమాలు.. నార్త్‌లోకి ఎక్కువుగా డబ్ అయ్యేవి. ఇది ఎన్టీఆర్, ఏఎన్నార్ టైం నుంచి నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే 1994లో కమెడియన్ ఆలీతో ఎస్వీ. కృష్ణారెడ్డి చేసిన సినిమా యమలీల. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. చాలా మంది కమెడియన్‌ను పెట్టి హీరోగా చేస్తున్నావు అని కృష్ణారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. అయినా ఆయన మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గకుండా ఈ సినిమా చేసి బ్లాక్‌బస్టర్ కొట్టారు.
ఈ సినిమా అప్పట్లో పెద్ద హీరోల సినిమాల పోటీని తట్టుకుని మరీ సూపర్ హిట్ అయ్యింది. పాటలతో పాటు కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన రామానాయుడు గారు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం రామానాయుడు ట్రై చేశారు. వెంకటేష్‌ను హీరోగా పెట్టి హిందీలో తీయాలన్నది నాయుడి గారి కోరిక. అయితే అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ రైట్స్ తీసేసుకున్నారు. రామానాయుడు కృష్ణను వెంకటేష్ కోసం రైట్స్ ఇవ్వమని అడిగారు.
అయితే కృష్ణ గానే వెంకటేష్‌ను హీరోగా పెట్టి బాలీవుడ్లో తీస్తానని చెప్పారు. రామానాయుడు ఒప్పుకున్నారు.అప్పుడు కృష్ణారెడ్డి బిజీగా ఉండడంతో మురళీమోహన్‌రావుతో హిందీలో రీమేక్ చేశారు. వెంకీకి జోడీగా రవీనా టాండన్ నటించింది. అప్పటికే చంటి రీమేక్‌తో వెంకటేష్‌కు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. థక్దీర్వాలా పేరుతో హిందీలో రీమేక్ చేశారు.
ఈ చిన్న పాత్రలో ప్రేక్షకులు వెంకీని ఊహించుకోలేకపోయారు. సినిమా డిజాస్టర్ అయ్యింది. వెంకీ – రవీనా టాండన్ కాంబినేషన్ అచ్చి రాలేదు. ఈ సినిమా తర్వాత వెంకీ మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు.